Home Actor ఫెయిల్యూర్ ని ఒప్పుకున్న అల్లు శిరీష్‌..!

ఫెయిల్యూర్ ని ఒప్పుకున్న అల్లు శిరీష్‌..!

81
0

అల్లు శిరీష్ న‌టించిన తాజా చిత్రం ఏబీసీడీ. ఈ సినిమాతో స‌క్స‌స్ సాధించాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేసాడు. మ‌ల‌యాళంలో స‌క్స‌స్ సాధించిన ఏబీసీడీ చిత్రాన్ని అదే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేసారు. మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే.. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా బోల్తా కొట్టింది. యూట్యూబ్ లో ఈ చిత్రంలోని మెల్ల మెల్ల‌గా సాంగ్ స‌క్స‌స్ అవ్వ‌డంతో…ఈ సినిమా కూడా అదే స్ధాయిలో విజ‌యం సాధిస్తుంది అనుకున్నారు కానీ…అలా జ‌ర‌గ‌లేదు.

ఈ సినిమా స‌క్స‌స్ సాధించ‌క‌పోవ‌డంతో అల్లు శిరీష్ సోష‌ల్ మీడియా ద్వారా ఓ లెట‌ర్ రిలీజ్ చేసారు. అందులో ఏబీసీడీ సినిమా కోసం చాలా క‌ష్టప‌డ్డాం.. కానీ ఈ సినిమా అనుకున్న ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. అభిమానులారా ఇందుకు గాను న‌న్ను క్షమించండి. ఏబీసీడీ కోసం దర్శకుడు సంజీవ్ రెడ్డితో పాటు నిర్మాత మ‌ధుర శ్రీధ‌ర్, య‌ష్ రంగినేని చాలా క‌ష్టప‌డ్డారు. కానీ మేం ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. అయితే ప్రజ‌లు ఇచ్చిన తీర్పును.. వాళ్ల స‌ల‌హాల‌ను ఖ‌చ్చితంగా పాటిస్తాను.

భవిష్యత్తులో మ‌రిన్ని మంచి సినిమాల‌ను చేయ‌డానికి నేను ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన స్నేహితులకు, మీడియా మిత్రులకు ధ‌న్యవాదాలు అని అల్లు శిరీష్ అభిమానులకు లేఖ రాశారు. అక్కినేని నాగ చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు చిత్రం ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో ఫిల్మ్ క్రిటిక్స్ ను మెప్పించ‌లేక‌పోయాను సారీ.. ఇక నుంచి క్రిటిక్స్ మెచ్చేలా సినిమాలు చేస్తాన‌న్నారు.

ఆత‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ చిత్రం ఫ్లాప్ అవ్వ‌డం గురించి అభిమానులకు లేఖ రాసారు. ఇప్పుడు అల్లు శిరీష్ ఈ విధంగా లెట‌ర్ రాసారు. ఏది ఏమైనా…హీరోలు వాస్త‌వాన్ని అంగీక‌రించడం…ఈ విధంగా లెట‌ర్స్ రాస్తుండ‌డం ఎంతైనా అభినంద‌నీయం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here