Home Movie News ఫ‌న్ టాస్టిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ సిల్లీ ఫెలోస్..!

ఫ‌న్ టాస్టిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ సిల్లీ ఫెలోస్..!

112
0
silly fellows review

అల్ల‌రి న‌రేష్ – సునీల్ కాంబినేష‌న్లో రూపొందిన లేటెస్ట్ మూవీ సిల్లీ ఫెలోస్. భీమ‌నేని శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సిల్లీ ఫెలోస్ ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. చాలా రోజుల త‌ర్వాత న‌రేష్ – సునీల్ క‌లిసి న‌టించ‌డంతో ఈ సినిమా పై ఫ‌స్ట నుంచి పాజిటివ్ టాక్ ఉంది. ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రు చెప్పే మాట‌..సినిమా అప్పుడే అయిపోయిందా అనిపించింది. న‌రేష్, సునీల్ కామెడీ బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే…సునీల్ ని చూస్తుంటే పాత సునీల్ ని చూసిన‌ట్టు అనిపించింది.

ఇక సెకండాఫ్ లో జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, పోసాని ల‌పై చిత్రీక‌రించిన సీన్ అయితే సూప‌ర్ అంటున్నారు. జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి… పొద్దునే 5 గంట‌ల‌కు అంటూ చెప్పే సీన్ అయితే హిలేరియ‌స్. ఇక బ్ర‌హ్మానందం క‌నిపించింది కాసేపే అయినా..త‌న‌దైన స్టైల్ లో అద‌ర‌గొట్టేసాడు. ఇక ఉన్న‌వి రెండు పాట‌లే అయినా రెండూ సూప‌ర్. నిర్మాత‌లు ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించారు. హీరోయిన్ చిత్ర‌శుక్లా పోలీస్ పాత్ర‌లో పాత్ర‌కు న్యాయం చేసింది. సినిమాకి పెద్ద ప్ల‌స్ పాయింట్ అంటే నిడివి రెండు గంట‌లు మాత్ర‌మే ఉండ‌డం అని చెబుతున్నారు.

ఖ‌చ్చితంగా న‌వ్విస్తాం అని సిల్లీ ఫెలోస్ టీమ్… వెరైటీగా ప్రామీస్ చేసారు. ప్రామీస్ చేసిన‌ట్టుగానే న‌వ్వించారు. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా విజ‌యం సాధించారు. ఫ‌స్ట్ షో నుంచే ఫ‌న్ టాస్టిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ సిల్లీ ఫెలోస్ అని టాక్ రావ‌డం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here