Home Actor బంగార్రాజు ప్రారంభం ఎప్పుడు..?

బంగార్రాజు ప్రారంభం ఎప్పుడు..?

89
0


కింగ్ నాగార్జున కెరీర్ లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. ఈ చిత్రం ద్వారా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. 50 కోట్ల‌కు పైగా షేర్ సాధించి సంచ‌ల‌నం సృష్టించ‌డంతో సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి సీక్వెల్ చేయాల‌నుకోవ‌డం..దీనికి బంగార్రాజు అనే టైటిల్ ఖ‌రారు చేయ‌డం తెలిసిందే. అయితే.. గ‌త కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ..అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ కృష్ణ స్ర్కిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ సినిమాని జూన్ లో ప్రారంభించ‌నున్నార‌ని తెలిసింది.  సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాని భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి..సోగ్గాడే చిన్ని నాయ‌నా స్ధాయిలో బంగార్రాజు ఆక‌ట్టుకుంటాడ‌ని..నాగ్ – చైతుల‌కు మంచి విజ‌యాన్ని అందిస్తాడ‌ని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here