Home Actor బంగార్రాజు వ‌చ్చేది ఎప్పుడు..?

బంగార్రాజు వ‌చ్చేది ఎప్పుడు..?

34
0
బంగార్రాజు వ‌చ్చేది ఎప్పుడు..? spiceandhra

టాలీవుడ్ కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ మ‌న్మ‌థుడు 2. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ట్రైల‌ర్ కు రికార్డు స్ధాయి వ్యూస్ రావ‌డంతో సినిమా పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న మ‌న్మ‌థుడు 2 ఆగ‌ష్టు 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమా పూర్తైన త‌ర్వాత బంగార్రాజు సినిమా చేస్తాన‌ని నాగార్జున గ‌తంలో ప్ర‌క‌టించారు. జులై లేదా ఆగ‌ష్టు ప్రారంభించి సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా గురించి అఫిషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ లేదు.

ఇదే విష‌యం గురించి నాగార్జునని అడిగితే… సినిమా ఇంకా స్టార్ట్ చేయ‌లేదు. క‌ళ్యాణ్ కృష్ణ త‌న సొంతూరులో ఉన్నారు. ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత స్టార్ట్ చేయాలి. స‌మ్మ‌ర్ కి బంగార్రాజు చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకుంటున్నాం అని చెప్పారు. సో.. సంక్రాంతికి వ‌స్తాడ‌నుకున్న బంగార్రాజు స‌మ్మ‌ర్ కి రాబోతున్నాడు. అదీ మ్యాట‌ర్..! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here