Home Actor బంగార్రాజు సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

బంగార్రాజు సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

72
0

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టిస్తోన్న తాజా చిత్రం మ‌న్మ‌థుడు 2. చి ల సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వం వహిస్తోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా ఆగ‌ష్టులో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే…ఈ సినిమా త‌ర్వాత నాగార్జున సోగ్గాడే చిన్ని నాయానా చిత్రానికి సీక్వెల్ బంగార్రాజు చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే ఈ సినిమాని ఎప్పుడు ప్రారంభిస్తార‌ని అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. జులైలో ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇందులో అనుష్క‌, సాయి ప‌ల్ల‌వి న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మా..?  కాదా..? అనేది తెలియాల్సివుంది.

ఈ క్రేజీ మూవీలో నాగ చైత‌న్య కూడా న‌టిస్తుండ‌డం విశేషం. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మించ‌నున్న ఈ సినిమాని త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here