Home Actor బన్నీ మూవీ టైటిల్ ఇదే..!

బన్నీ మూవీ టైటిల్ ఇదే..!

23
0

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది అల్లు అర్జున్ కి 19వ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో ఈ సినిమా రూపొందుతోందనీ… ఈ చిత్రానికి  నేను – నాన్న అనే టైటిల్ ఖ‌రారు చేసార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే… ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే… ఈ చిత్రానికి వైకుంఠ‌పురంలో అనే టైటిల్ ఖ‌రారు చేసార‌నేది తాజా వార్త‌.

బ‌న్నీ స‌ర‌స‌న  పూజా హెగ్డే న‌టిస్తుంది. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా వైకుంఠ‌పురంలో అనే టైటిల్ నే ఖ‌రారు చేసారా..?  లేక వేరే టైటిల్ పెట్టారా..?  అనేది ఆగ‌ష్టు 15న తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here