Home Actor బాబాయ్ – అబ్బాయ్ ముఖ్య అతిధులుగా ఓ..బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్..!

బాబాయ్ – అబ్బాయ్ ముఖ్య అతిధులుగా ఓ..బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్..!

87
0
బాబాయ్ - అబ్బాయ్ ముఖ్య అతిధులుగా ఓ..బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్..! spiceandhra

స‌మంత అక్కినేని న‌టించిన తాజా చిత్రం ఓ..బేబీ. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న క‌థా చిత్రం కొరియ‌న్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్. 7 భాషల్లో ఆదరణ పొందిన ఈ కథను తెలుగులో రీమేక్ చేయ‌డంతో ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి పాజిటివ్ టాక్ ఉంది. సీనియర్ హీరోయిన్ లక్ష్మి కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, వచ్చేనెల 5వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సంద‌ర్భంగా ఓ..బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట‌న్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి ప్రారంభించ‌నున్నారు. హైద‌రాబాద్ లో జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ ఈ వేడుక జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కు బాబాయ్ వెంక‌టేష్ – అబ్బాయ్ రానా ముఖ్య అతిధులుగా హాజ‌ర‌వుతున్నారు. ఈ చిత్రంలోని పాట‌ల‌కు, అలాగే టీజ‌ర్ & ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మించాయి. వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తూ..వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న స‌మంత ఓ..బేబీ సినిమాతో మ‌రో విజ‌యం సాధించ‌డం ఖాయం అనే టాక్ ఉంది. మ‌రి..అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఓ బేబీ ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here