Home Political News బాబాయ్ ప‌వ‌న్ ప్ర‌సంగం పై అబ్బాయ్ చ‌ర‌ణ్ కామెంట్..!

బాబాయ్ ప‌వ‌న్ ప్ర‌సంగం పై అబ్బాయ్ చ‌ర‌ణ్ కామెంట్..!

100
0

జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌వాస గ‌ర్జ‌న‌లో భాగంగా డ‌ల్లాస్ స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ స‌మావేశానికి పెద్ద ఎత్తున జ‌నం త‌ర‌లి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌సంగిస్తూ… నిజ‌మైన ధైర్యం అంటే భ‌యం లేక‌పోవ‌డం కాదు. ప్ర‌తి రోజు భ‌యాన్ని ఎదుర్కొవ‌డమే అంటూ అక్క‌డున్నవారిలో ఉత్తేజం నింపేలా మాట్లాడారు. ఓ 25 సంవ‌త్స‌రాల జీవితాన్ని దేశం కోసం, స‌మాజం కోసం, రాష్ట్రాల కోసం మాన‌వ‌త్వం కోసం కేటాయించాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అందుకే 2014లో పార్టీ  స్ధాపించాన‌ని చెప్పారు.

బాబాయ్ ప‌వ‌న్ ప్ర‌సంగం గురించి అబ్బాయ్ చ‌ర‌ణ్ ఫేస్ బుక్ లో కామెంట్ చేసారు. ఇంత‌కీ చ‌ర‌ణ్ ఏమ‌ని కామెంట్ చేసారంటే…ప్ర‌తిరోజు భ‌యాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. భ‌యంలోని మార్పును ఎదుర్కొలేక‌పోవ‌డ‌మే పెద్ద భ‌యం. ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను విన్న బెస్ట్ ఇన్ స్పిరేషన్ స్పీచ్ ఇదే అని..దిమేన్, ది లీడ‌ర్, ది విజ‌న‌రీ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్అంటూ చ‌ర‌ణ్ పోస్ట్ చేసాడు. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ పై చ‌ర‌ణ్ ఇలా కామెంట్ చేయ‌డంతో మెగా అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here