Home Political News బాబుకు అరెస్ట్ వారెంట్ – దేశ చ‌రిత్ర‌లోనే పెద్ద కుట్ర – నామా నాగేశ్వ‌ర‌రావు

బాబుకు అరెస్ట్ వారెంట్ – దేశ చ‌రిత్ర‌లోనే పెద్ద కుట్ర – నామా నాగేశ్వ‌ర‌రావు

123
0
Cadre-Favouring-TDP-Congress-Alliance-1529391978-159

ప్ర‌జా స‌మ‌స్య‌ల పై పోరాడే సీ.ఎం పై కేసు న‌మోదు చేయ‌డం దేశ చ‌రిత్ర‌లోనే పెద్ద కుట్ర. మొత్తం 8 సెక్ష‌న్ ల కింద కేసులు న‌మోదు చేసారు. కుట్ర‌ను తిప్పికొట్టేందుకు తెలుగు జాతి అంతా ఏకం కావాలి అంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వెంట‌నే కేసు ఉప‌సంహ‌రించుకుని తెలుగుజాతికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు. ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాకే నోటీసులు ఇచ్చారు. ఒక ముఖ్య‌మంత్రి పై నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయ‌డం దారుణం అన్నారు.

బాబ్లీ సంద‌ర్శ‌న‌కు వెళితే పోలీసులు విచ‌క్ష‌ణార‌హితంగా వ్య‌వ‌హ‌రించారు. క‌నీస సౌక‌ర్యాలు లేని చిన్న క‌ళాశాల‌లో అంద‌రినీ ఉంచారు. నేల పై ప‌డుకుని నిర‌స‌న తెలియ‌చేసాం. ప్ర‌జా ప్రతినిధుల‌కు క‌నీసం త్రాగ‌డానికి మంచి నీళ్లు కూడా ఇవ్వ‌లేదు. మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధులు ప‌ట్ల కూడా క్రూరంగా ప్ర‌వ‌ర్తించారు. తెలంగాణ‌కు అన్యాయం జ‌రుగుతుంద‌నే బాబ్లీ ప్రాజెక్ట్ సంద‌ర్శ‌న‌కు వెళ్లాం. ఎలాంటి గొడ‌వ‌ల‌కు రాలేద‌ని చెప్పినా వినిపించుకోలేదు. రాత్రికి రాత్రి మా అంద‌రినీ వ్యానులో త‌ర‌లించారు. శవాల‌ను తీసుకెళ్లే వాహ‌నాల్లో మ‌మ్మ‌ల్ని తీసుకెళ్లారు. ఎలాంటి కేసులు లేవ‌ని పార్ల‌మెంటులో తెలిపారు. మేము ఏం చేసామ‌ని కేసులు పెట్టారంటూ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here