Home Actor బాబు.. బస్తీమే సవాల్ – వ‌ర్మ‌

బాబు.. బస్తీమే సవాల్ – వ‌ర్మ‌

139
0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైసీపీ సంచ‌ల‌న విజయం సాధించ‌డంతో సంచ‌ల‌న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఫలితాలు వచ్చిన రోజు నుంచి వరుసగా టీడీపీ వ్యతిరేక ట్వీట్లతో వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఏపీలో విడుదల కాకుండా నిలిపేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఈ నెల 31 విడుదల చేస్తున్నట్లు వ‌ర్మ ట్విట్ట‌ర్ ద్వారా తెలియచేసారు. అంతే కాకుండా.. బస్తీమే సవాల్ అంటూ చంద్రబాబు నాయుడుకు ఛాలెంజ్ విసిరారు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే… ఇటీవల వ‌ర్మ‌ విజయవాడలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రెస్‌మీట్ పెట్టడానికి ప్రయత్నించగా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి హైద‌రాబాద్ కి పంపించేసారు. పోలీసులు తనని అడ్డుకోడానికి చంద్రబాబు నాయుడే కారణమని, ఆయన ఆదేశాలతోనే పోలీసులు తనని అరెస్టు చేశారని వ‌ర్మ‌ ఆరోపించారు. అయితే… తాజా ఫలితాల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆర్జీవీ ఆనందానికి అవధులు లేవు.

ఎక్కడయితే మాజీ సీఎం నన్ను అరెస్టు చేయించి విజయవాడ నుంచి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో ఎన్టీఆర్‌ సర్కిల్‌ దగ్గర ఎల్లుండి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్‌ మీట్‌ పెట్టబోతున్నాం. బస్తి మే సవాల్‌… ఎన్టీఆర్‌ నిజమైన అభిమానులకి ఇదే నా బహిరంగ ఆహ్వానం.. జై జగన్‌ అని వర్మ ట్వీట్ చేశారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here