Home Actor బాలీవుడ్ లో..ఇస్మార్ట్ శంక‌ర్..?

బాలీవుడ్ లో..ఇస్మార్ట్ శంక‌ర్..?

43
0
బాలీవుడ్ లో..ఇస్మార్ట్ శంక‌ర్..? spiceandhra

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ – డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. పూరి – ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఇస్మార్ట్ శంక‌ర్ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ.. సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. నాలుగు రోజుల‌కు దాదాపు 50 కోట్లు గ్రాస్ క‌లెక్ట్ చేసి బ్లాక్ బ‌ష్ట‌ర్ గా నిలిచింది.

దీంతో పూరి నెక్ట్స్ మూవీ ఎవ‌రితో అనేది ఆస‌క్తిగా మారింది. బాల‌య్య‌తో పూరి నెక్ట్స్ మూవీ ఉంటుంద‌ని ఓ వైపు ప్ర‌చారం జ‌రుగుతుంటే… సెన్సేష‌న‌ల్ స్టార్ విజయ్ దేవ‌ర‌కొండ‌తో పూరి సినిమా అంటూ మ‌రో వైపు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే… తాజా వార్త ఏంటంటే… ఇస్మార్ట్ శంక‌ర్ ని బాలీవుడ్ లో రీమేక్ చేయ‌మ‌ని పూరికి బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ ఆఫ‌ర్ చేసార‌ట‌.

ర‌ణ‌వీర్ సింగ్ తో ఇస్మార్ట్ శంక‌ర్ బాలీవుడ్ రీమేక్ ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పూరికి ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్స‌స్ త‌ర్వాత చాలా ఆఫ‌ర్స్ వ‌చ్చిన‌ప్ప‌టికీ బాలీవుడ్ రీమేక్ పైనే ఇంట్ర‌స్ట్ చూపిస్తున్న‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం ఈ స‌క్స‌స్ ని ఎంజాయ్ చేస్తూ.. ఓ రెండునెల‌లు రెస్ట్ తీసుకోవాల‌నుకుంటున్నాడ‌ట పూరి. ఆత‌ర్వాతే త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో అనేది ఫైన‌ల్ చేస్తాడ‌ట‌. మ‌రి.. ఎవ‌రితో మూవీ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here