Home Actor బాలీవుడ్ లో ఎవ‌డు చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారా..?

బాలీవుడ్ లో ఎవ‌డు చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారా..?

56
0
బాలీవుడ్ లో ఎవ‌డు చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారా..? spiceandhra

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన భారీ చిత్రం ఎవ‌డు. ఈ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించారు. 2014లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయాల‌నుకుంటు న్నార‌ట‌. `హేట్ స్టోరీ 4` ద‌ర్శ‌కుడు మిలాప్ జ‌వేరి, నిఖిల్ అద్వానీ ఇద్ద‌రు ఎవ‌డు సినిమాని చూసార‌ట‌.

ఈ సినిమా న‌చ్చ‌డంతో దిల్ రాజుని కాంటాక్ట్ చేసార‌ట‌. బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు దిల్ రాజు వెంట‌నే ఓకే చెప్పార‌ట‌. దిల్ రాజు, నిఖిల్ అద్వానీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిలాప్ జ‌వేరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యిన త‌ర్వాత ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ ఎవ‌ర్ని ఎంపిక చేయాలి అనేది ఆలోచిస్తారట‌.  అయితే..రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ పాత్ర‌ల‌ను ఎవ‌రు పోషిస్తారు అనేది ఆస‌క్తిగా మారింది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here