Home Actor బాలీవుడ్ లో కాంచ‌న‌. ఎవ‌రితో తెలుసా..?

బాలీవుడ్ లో కాంచ‌న‌. ఎవ‌రితో తెలుసా..?

87
0

రాఘవ లారెన్స్ న‌టించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం కాంచ‌న 3. హ‌ర్ర‌ర్ మూవీస్ తో లారెన్స్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాడో తెలిసిందే. కాంచ‌న 2 వ‌లే కాంచ‌న 3 కూడా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించింది. తెలుగు, త‌మిళ్ లో రూపొందిన ఈ సినిమా రెండు భాష‌ల్లో 100 కోట్లు క‌లెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇచ్చిన స‌క్స‌స్ తో వెంట‌నే  ‘కాంచన 4’ స్టార్ట్‌ చేయమని లారెన్స్ కి డిస్ట్రిబ్యూట‌ర్స్ చెబుతున్నారట‌.

అయితే..లారెన్స్ ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే మెయిన్‌ పాయింట్‌ కోసం రీసెర్చ్‌ చేస్తున్నాడ‌ట‌. ఎందుకంటే… ఈ సినిమాలో మిగతా వారికి అన్నం పెడితే దేవుడు మనకి అన్నం పెడతాడని చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు. ఇంతకు ముందు హిజ్రాల గురించి, దానికి ముందు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్‌ గురించి చెప్పారు. అలాంటి ఒక మంచి పాయింట్‌ దొరికితే త్వరగా స్టార్ట్ చేస్తాన‌ని లారెన్స్ చెప్పారు.

ఇదిలా ఉంటే..కాంచ‌న 2 చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయ‌నున్నాడు లారెన్స్. బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ తో కాంచ‌న 2 రీమేక్ చేయ‌నున్న‌ట్టు లారెన్స్ ఎనౌన్స్ చేసారు. మ‌రి..తెలుగు, త‌మిళ్ లో సంచ‌ల‌నం సృష్టించిన కాంచ‌న బాలీవుడ్ లో కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here