Home Actor బాలీవుడ్ లో.. డియ‌ర్ కామ్రేడ్. ఇంత‌కీ హీరో ఎవ‌రు..?

బాలీవుడ్ లో.. డియ‌ర్ కామ్రేడ్. ఇంత‌కీ హీరో ఎవ‌రు..?

29
0
బాలీవుడ్ లో..డియ‌ర్ కామ్రేడ్. ఇంత‌కీ హీరో ఎవ‌రు..? spiceandhra

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన తాజా చిత్రం డియ‌ర్ కామ్రేడ్. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న క‌థా చిత్రం సాంగ్స్, & టీజ‌ర్ విశేషంగా ఆక‌ట్టుకోవ‌డంతో  సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. గీత గోవిందం సినిమాలో జంట‌గా న‌టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ – ర‌ష్మిక ఈ మూవీలో కూడా న‌టించ‌డంతో ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూద్దామా అని ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు.

ఈ నెల 26న తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే.. ఈ సినిమాని త్వరలో హిందీలో రీమేక్ చేయనున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాని హిందీలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ రూపొందించ‌నున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌మీడియా ద్వారా తెలియ‌చేసారు.

 డియర్ కామ్రేడ్ సినిమాని నిర్మాత నవీన్ ఎర్నేని, దర్శకుడు భరత్ కమ్మ, హీరో విజయ్‌తో కలిసి ఆయన చూశారు. సినిమా తనను ఎంతో ఆకట్టుకుందని, కదిలించిందని ఆయన పేర్కొన్నారు. అయితే.. హిందీ రీమేక్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించ‌నున్నాడు అని..ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే విష‌యం గురించి విజ‌య్ ని అడిగితే… డియ‌ర్ కామ్రేడ్ హిందీ రీమేక్ లో న‌టించ‌డం లేద‌ని చెప్పారు. మ‌రి.. డియ‌ర్ కామ్రేడ్ రీమేక్ లో ఎవ‌రు న‌టిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here