Home Actor బాల‌కృష్ణ మూవీ టైటిల్ మారిందా..?

బాల‌కృష్ణ మూవీ టైటిల్ మారిందా..?

63
0

నంద‌మూరి న‌ట సింహం బాలకృష్ణ..త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్.ర‌వి కుమార్ ద‌ర్శ‌కత్వంలో ఓ భారీ చిత్రంలో న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మించ‌నున్నారు. ప్రస్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని స‌మాచారం.  ఈ సినిమాకి రూలర్ అనే టైటిల్ ను ఖరారు చేసిన‌ట్టుగా ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే….ఈ మూవీ టైటిల్ మారింద‌ట‌. ఈ సినిమాలో క‌థ‌నాయ‌కుడు పేరు క్రాంతి అని… అందువలన ఈ మూవీకి ‘క్రాంతి’ అనే టైటిల్ ఖ‌రారు చేసేందుకు టీమ్ ఆస‌క్తి చూపుతున్నార‌ని స‌మాచారం. దాదాపు ఈ టైటిల్ ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ కనిపించనున్నాడని చెబుతున్నారు. ఆయన పాత్ర ..టెంపర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర తరహాలో ఉంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here