Home Actor బాల‌కృష్ణ 105వ చిత్రం ప్రారంభం..!

బాల‌కృష్ణ 105వ చిత్రం ప్రారంభం..!

68
0

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హీరోగా కె.ఎస్‌.ర‌వి కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొంద‌నుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ రోజు ప్రారంభించారు.  సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్ పై సి.క‌ళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ హిట్ కాంబినేష‌న్‌లో ఇది వ‌ర‌కు జై సింహా అనే సూప‌ర్ హిట్ సినిమా రూపొందింది. బాల‌కృష్ణ పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా, బోయ‌పాటి శ్రీను కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కోదండ రామిరెడ్డి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

 జూలై నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ప‌రుచూరి ముర‌ళి క‌థ‌ను అందిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తుండ‌గా రామ్‌ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. రామ్‌లక్ష్మ‌ణ్ యాక్ష‌న్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.  చిన్నా ఆర్ట్ వ‌ర్క్‌ను అందిస్తున్నారు. సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.  ఈ చిత్రానికి సంబంధించిన‌ ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌చేయ‌నున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here