Home Actor బాల‌య్య‌, బోయ‌పాటి సినిమా గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

బాల‌య్య‌, బోయ‌పాటి సినిమా గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

108
0


నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ‌, ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో సింహా, లెజెండ్ చిత్రాలు రూపొంద‌డం…ఈ రెండు చిత్రాలు బ్లాక్ బ‌ష్ట‌ర్స్ అవ్వ‌డం తెలిసిందే. వీరిద్ద‌రూ క‌లిసి మ‌రో సినిమా చేయ‌నున్న‌ట్టు బాల‌కృష్ణ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎనౌన్స్ చేసారు. ఫిబ్ర‌వ‌రి నుంచే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు. అయితే…విన‌య విధేయ రామ సినిమా డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో ఈసారి ఎలాగైనా స‌రే స‌క్స‌స్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో బోయ‌పాటి స్ర్కిప్ట్ పై మ‌రోసారి వ‌ర్క్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 

ఇదిలా ఉంటే…ఈ మూవీ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే….ఈ సినిమాని మార్చి 28న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించి… రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం ఎన్నిక‌ల అనంత‌రం ప్రారంభిస్తార‌ట‌. మ‌రో విష‌యం ఏంటంటే…ఈ సినిమాని ఎన్.బి.కె బ్యాన‌ర్ లో బాల‌కృష్ణ నిర్మించ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు కానీ..ఇప్పుడు సి.క‌ళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నార‌ట‌. ఈ మూవీ కోసం ర‌కుల్ ప్రీత్ సింగ్, శ్ర‌ద్ధా శ్రీనాథ్ ల‌ను సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం. మ‌రి…త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు ప్ర‌క‌టిస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here