Home Actor బాల‌య్య‌, బోయ‌పాటి సినిమా ఉందా..? లేదా..?

బాల‌య్య‌, బోయ‌పాటి సినిమా ఉందా..? లేదా..?

76
0

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ‌, ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందిన‌ సింహా, లెజెండ్ చిత్రాలు ఎంత‌టి విజ‌యాన్ని సాధించాయో తెలిసిందే. దీంతో వీరిద్ద‌రి కల‌యిక‌లో రానున్న హ్యాట్రిక్ ఫిల్మ్ కోసం బాల‌య్య అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాల‌య్య‌..బోయ‌పాటితో సినిమాని ఎనౌన్స్ చేసారు. ఈ మూవీని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు.

అయితే.. రామ్ చ‌ర‌ణ్ తో తెర‌కెక్కించిన విన‌య విధేయ రామ సినిమా డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో బాల‌య్య‌తో చేయ‌నున్న సినిమా క‌థ విష‌యంలో బోయ‌పాటి చాలా కేర్ తీసుకుంటున్నార‌ట‌. ఈ సినిమాతో సంచ‌ల‌న విజ‌యం సాధించి త‌న పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు ఈ సినిమాతోనే స‌మాధానం చెప్పాలి అనుకుంటున్నార‌ట‌. ఇదిలా ఉంటే..ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో బాల‌య్య ఫుల్ బిజీ. అందుచేత  ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈలోపు బోయ‌పాటి చంద్ర‌బాబు మీడియా టీమ్ తో క‌లిసి తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌ల వ‌ర్క్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here