Home Actor బాల‌య్య మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

బాల‌య్య మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

56
0

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ హీరోగా త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సి.కె. ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ నెల 17న ఈ సినిమాని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించి జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే..ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కి వ‌చ్చింది. అది ఏంటంటే…ఇందులో ఓ క‌థానాయిక‌గా హ‌రిప్రియ‌ను సెలెక్ట్ చేసిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయ‌ల్ రాజ్ ఫుట్ ను ఖ‌రారు చేసిన‌ట్టు టాక్ వినిపిస్తోంది. బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా న‌టిస్తున్నఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్ పాత్ర పోషిస్తున్నారు. లెజెండ్ త‌ర్వాత బాల‌య్య, జ‌గ‌ప‌తిబాబు క‌లిసి ఈ సినిమాలో న‌టిస్తుండ‌డంతో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

వైవిధ్య‌మైన క‌థ‌,క‌థ‌నంతో సాగే ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాల‌య్య‌, కె.ఎస్.ర‌వికుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన జై సింహా సంక్రాంతికి వ‌చ్చి సక్స‌స్ సాధించింది. మ‌రి…ఈ సినిమా కూడా సంక్రాంతికి రానుంది కాబ‌ట్టి విజ‌యం సాధిస్తుందేమో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here