Home Actor బాల‌య్య మూవీ టైటిల్ ఇదే..!

బాల‌య్య మూవీ టైటిల్ ఇదే..!

95
0

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ‌.. త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌ర‌గుతోంది. ఈ చిత్రాన్ని సి.కె. ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 17న ఈ సినిమాని ప్రారంభించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, శ‌ర‌త్ కుమార్ కుమార్తె వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ విల‌న్స్ గా న‌టించ‌నున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇదిలా ఉంటే…ఈ సినిమాకి రూల‌ర్ అనే టైటిల్ అనుకుంటున్నార‌ని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇటీవ‌ల ఫిల్మ్ ఛాంబ‌ర్ లో సి.క‌ళ్యాణ్ ఈ టైటిల్ ని రిజిష్ట‌ర్ చేయించార‌ని తెలిసింది. అందుచేత ఈ మూవీ కోస‌మే సి.క‌ళ్యాణ్ ఈ టైటిల్ రిజిష్ట‌ర్ చేయించార‌ని ప్రచారం జ‌రుగుతోంది. అయితే..బాల‌య్య బోయ‌పాటితో ఓ సినిమా చేయ‌నున్నాడు. బోయ‌పాటి గ‌తంలో రూల‌ర్ అనే టైటిల్ తో సినిమా చేయాల‌నుకున్నారు.

బాల‌య్య‌, బోయ‌పాటి కాంబినేష‌న్ లో రూపొందే సినిమాని కూడా సి.క‌ళ్యాణ్ నిర్మించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అందుచేత సి.క‌ళ్యాణ్ రిజిష్ట‌ర్ చేయించిన టైటిల్ కె.ఎస్.ర‌వికుమార్ మూవీ కోస‌మా..? లేక బోయ‌పాటి మూవీ కోస‌మా..? అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here