Home Telugu బాల‌య్య సినిమాకు ముహుర్తం ఖ‌రారు..!

బాల‌య్య సినిమాకు ముహుర్తం ఖ‌రారు..!

105
0

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ‌…ఇటీవ‌ల ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. జూన్ నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించాలి అనుకున్నారు. అయితే…అనుకోకుండా డైరెక్ట‌ర్ తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోవ‌డంతో…ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కోసం ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉంటే..ఈ సినిమా కంటే ముందుగా మ‌రో మూవీ చేయనున్నారు బాల‌య్య. దీని కోసం క‌థా చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డం..క‌థ విని బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం కూడా జ‌రిగింది.

ఈ మూవీకి డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. గ‌తంలో బాల‌య్య – వినాయ‌క్ కాంబినేష‌న్లో చెన్న‌కేశ‌వ‌రెడ్డి చిత్రం రూపొందింది. వినాయ‌క్ కి మాస్ ప‌ల్స్ బాగా తెలుసు. బాల‌య్య‌కి మాస్ లో ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇక వీరిద్ద‌రు క‌లిసి సినిమా చేస్తే…మాస్ ఆడియ‌న్స్ లో అంచ‌నాలు ఏరేంజ్ లో ఉంటాయో ఊహించుకోవ‌చ్చు. అయితే… ఆడియ‌న్స్ ఎంత‌ ఎక్స్ పెక్టేష‌న్స్ తో వ‌చ్చినా ఆక‌ట్టుకునేలా ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ రెడీ చేసార‌ట వినాయ‌క్ టీమ్.

ఈ సినిమాని ఈ నెల 27న ప్రారంభించేందుకు ముహుర్తం ఖ‌రారు చేసార‌ని స‌మాచారం. ఇక హీరోయిన్ విష‌యానికి వ‌స్తే…ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న న‌టించేందుకు శ్రియ‌ను సెలెక్ట్ చేసార‌ట‌. బాల‌య్య‌, శ్రియ క‌లిసి చెన్న‌కేశ‌వ‌రెడ్డి, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, పైసా వ‌సూల్ చిత్రాల్లో న‌టించారు.ఈ భారీ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here