Home Actor బాల‌య్య సినిమా పోస్ట్ పోన్ అయ్యిందా..? క్యాన్సిల్ అయ్యిందా..?

బాల‌య్య సినిమా పోస్ట్ పోన్ అయ్యిందా..? క్యాన్సిల్ అయ్యిందా..?

59
0

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ…త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్.ర‌వి కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందునున్న‌ విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మించ‌నున్నారు. ఈ సినిమా ఈపాటికే స్టార్ట్ అవ్వాలి కానీ…ప్రారంభం కాలేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… ఈ సినిమా ఆగిపోయింద‌ట‌. అవును..ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఇంత‌కీ విష‌యం ఏంటంటే…ఈ  సినిమాలో జ‌గ‌ప‌తి బాబు విల‌న్. ఆయ‌న డ్యూయ‌ల్ రోల్ చేయ‌నున్నారు.

 ఫ్లాష్ బ్యాక్ లో తాత విల‌న్ అయితే… ఆత‌ర్వాత మ‌న‌వ‌డు విల‌న్ అవుతాడ‌ట‌. ఈ రెండు క్యారెక్ట‌ర్ల‌ను వై.ఎస్.రాజారెడ్డి, వై.ఎస్ జ‌గ‌న్ రెడ్డిల‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నార‌ట‌. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ సీఎం. ఇలాంటి టైమ్ లో ఈ సినిమా వ‌స్తే…బాగోదు అనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని క్యాన్సిల్ చేసిన‌ట్టు టాక్ వినిపిస్తోంది. అయితే…డైరెక్ట‌ర్ కె.ఎస్.ర‌వికుమార్ మాత్రం క‌థ‌లో మార్పులు చేసి ఎలాగైనా స‌రే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

కె.ఎస్ .ర‌వి కుమార్ చెప్పే మార్పుల‌కు బాల‌య్య ఓకే చెబుతారా..?  లేదా అనేది ఆస‌క్తిగా మారింది.  ప్ర‌స్తుతానికైతే క‌థ విష‌యంలో మార్పులు కోసం ఆగింది. మార్పులు చేసిన త‌ర్వాత సంతృప్తిక‌రంగా రాక‌పోతే క్యాన్సిల్ అయ్యే అవ‌కాశం ఉంది. మ‌రి..ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here