Home Actor బాల‌య్య స‌ర‌స‌న ఆ హీరోయిన్ న‌టిస్తుందా.? ఇంత‌కీ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

బాల‌య్య స‌ర‌స‌న ఆ హీరోయిన్ న‌టిస్తుందా.? ఇంత‌కీ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

47
0
బాల‌య్య స‌ర‌స‌న ఆ హీరోయిన్ న‌టిస్తుందా.? ఇంత‌కీ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..? spiceandhra

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ… త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం అయ్యింది కానీ.. ఇంకా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఈ భారీ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు. అయితే… ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే… బాల‌య్య స‌ర‌స‌న న‌టించేందుకు భూమిక‌ను సెలెక్ట్ చేసార‌ట‌.

చిరంజీవితో జై చిరంజీవ‌, నాగార్జున‌తో స్నేహ‌మంటే ఇదేరా, వెంక‌టేష్ తో వాసు చిత్రాల్లో భూమిక న‌టించింది కానీ.. బాల‌య్య‌తో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించ‌లేదు. ఇప్పుడు బాల‌య్య‌తో న‌టించే ఛాన్స్ భూమిక ద‌క్కించుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. బాలకృష్ణ ఈ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికలుగా సోనాల్ చౌహాన్ ను .. వేదికను ఎంపిక చేసినట్టుగా తెలిసింది.

 ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకం కానుందని చెబుతున్నారు. బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో భూమిక పాత్ర కనిపిస్తుందని అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను వచ్చేనెల 7వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగు ప్రారంభించ‌నున్నారు. బ్యాంకాక్ లో ఫ‌స్ట్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారని స‌మాచారం.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here