Home Actor బిగ్ బాస్ షో నుంచి నాగార్జున త‌ప్పుకుంటారా..?

బిగ్ బాస్ షో నుంచి నాగార్జున త‌ప్పుకుంటారా..?

100
0
బిగ్ బాస్ షో నుంచి నాగార్జున త‌ప్పుకుంటారా..? spiceandhra

బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2… ఈ రెండు సీజ‌న్లు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుని.. స‌క్స‌స్ సాధించిన విష‌యం తెలిసిందే. ఈ నెల 21 నుంచి బిగ్ బాస్ 3 ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసారు. అయితే.. ఈ రియాల్టీ షో ప్రారంభం కాకుండానే వివాదాల‌కు కార‌ణ‌మైంది. శ్వేతారెడ్డి, గాయ‌త్రి గుప్తా న‌టీమ‌ణులు షో నిర్వాహ‌కుల‌పై కేసులు కూడా పెట్టారు. ఉస్మానియా విద్యార్థులు బిగ్‌బాస్ నిర్వాహ‌కులు స‌భ్యుల ప‌ట్ల తప్పుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ మాన‌వ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు ఓయూ స్టూడెంట్స్ బిగ్ బాస్ 3 కి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హరించ‌నున్న నాగార్జున ఇంటిని ముట్ట‌డించారు. ప‌రిస్థితి సీరియ‌స్ గా ఉండ‌డంతో స్టార్ మా యాజ‌మాన్యం రేప‌టి నుంచి ప్రారంభం కానున్న షో విష‌యంలో ఆలోచ‌న‌లోప‌డ్డార‌ని… అలాగే ఈ షో నుంచి త‌ప్పుకునే ఆలోచ‌న‌లో నాగార్జున ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here