Home Telugu బిగ్ బాస్ 2 లో పాల్గొనేది వీళ్లే..!

బిగ్ బాస్ 2 లో పాల్గొనేది వీళ్లే..!

111
0

బుల్లితెర పై సంచ‌ల‌నం బిగ్ బాస్ రియాల్టీ షో. తెలుగులోకి బిగ్ బాస్ షో రావ‌డం..దీనికి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డం..ఈ షో గ్రాండ్ స‌క్స‌స్ అవ్వ‌డం తెలిసిందే. అయితే…మొద‌ట్లో బిగ్ బాస్ సీజ‌న్ 1 ఎలా ఉంటుందో..?  తెలుగులో విజ‌యం సాధిస్తుందో లేదో..? అనే అనుమానం ఉండేది. అయిన‌ప్ప‌టికీ… ఊహించ‌ని స్ధాయిలో స‌క్స‌స్ సాధించింది. దీనంత‌టికీ కార‌ణం..ఎన్టీఆర్ వ్యాఖ్యానం. టెలివిజ‌న్ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత టీఆర్పీ రేటింగ్ తో బిగ్ బాస్ సీజ‌న్ 1 సంచ‌ల‌నం సృష్టించింది.

దీంతో బిగ్ బాస్ సీజ‌న్ 2 ఎలా ఉండ‌బోతుంది..?  ఈసారి ఎవ‌రెవ‌రు పాల్గొన‌బోతున్నారు..? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రో విష‌యం ఏమిటంటే…సీజ‌న్ 2కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. ఎందుకంటే…ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు. ఆత‌ర్వాత రాజ‌మౌళితో సినిమా చేయ‌నున్నారు. ఈ రెండు సినిమాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న బిగ్ బాస్ కి నో చెప్పేసారు. స్టార్ మా యాజ‌మాన్యం ఎన్టీఆర్ నో చెప్ప‌డంతో సీజ‌న్ 2 కి వ్యాఖ్యాత‌గా నానిని ఎంపిక చేసారు.

ఇక సీజ‌న్ 2 గురించి లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే…సీజ‌న్ 1 ని ముంబైలో ప్ర‌త్యేకంగా రూపొందించిన హౌస్ సెట్ లో చిత్రీక‌రించారు. ఈసారి ముంబైలో కాకుండా హైద‌రాబాద్ లోని అన్న‌పూర్ణ స్టూడియోలో ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కంటెస్టెంట్స్ గా హీరో తరుణ్, సీనియ‌ర్ హీరోయిన్ రాశీ, గ‌జాలా, సింగర్ గీతామాధురి, ట్రాన్స్ జెండ‌ర్ శ్యామ‌లాదేవి,తేజస్వి మదివాడ
పేర్లు వినిపిస్తున్నాయి.  ఈ కార్యక్రమానికి వీళ్లు ప్రత్యేక ఆకర్షణ కాగలరనే టాక్ వినిపిస్తోంది. మ‌రి…బిగ్ బాస్ సీజ‌న్ 2 ఏ స్ధాయిలో ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here