Home Actor బిగ్ బాస్ 3 ఎవ‌రు..?

బిగ్ బాస్ 3 ఎవ‌రు..?

102
0


బిగ్ బాస్ 1 హోస్ట్ గా ఎన్టీఆర్ సంచ‌ల‌నం సృష్టించడం తెలిసిందే. టెలివిజ‌న్ హిస్ట‌రీలోనే రికార్డ్ స్ధాయి టీఆర్పీ రేటింగ్ సాధించి బిగ్ బాస్ 1 సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. దీనికి కార‌ణం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఈ షోను అంద‌రికీ న‌చ్చేలా అద్భుతంగా నిర్వ‌హించ‌డ‌మే. ఆత‌ర్వాత బిగ్ బాస్ సీజ‌న్ 2కు కూడా ఎన్టీఆరే హోస్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు కానీ…సినిమాల్లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న ఆ అవ‌కాశం నానికి వ‌చ్చింది.

అయితే…నాని మొద‌ట్లో కాస్త త‌డ‌బ‌డినా…ఆతర్వాత పుంజుకుని త‌న‌దైన శైలిలో షోను న‌డిపిస్తూ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసాడు కానీ..సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లే ఎక్కువుగా వ‌చ్చాయి. ఇప్పుడు బిగ్ బాస్ సీజ‌న్ 3 రాబోతోంది. ఈసారి ఎవ‌రు హోస్ట్ గా ఉండ‌బోతున్నారు అనేది ఆస‌క్తిగా మారింది. ఎన్టీఆర్ మ‌ళ్లీ హోస్ట్ గా చేయ‌నున్నార‌ని టాక్ వ‌చ్చింది కానీ..రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ బిజీగా ఉండ‌డం వ‌ల‌న ఈ షోకు టైమ్ కేటాయించ‌లేన‌ని చెప్పేసాడ‌ట‌.

ఎన్టీఆర్ కాక‌పోతే మ‌రి ఎవ‌రు..?  అంటే..టాలీవుడ్ కింగ్ నాగార్జున పేరు వినిపిస్తోంది. మా టీవీలో మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రొగ్రామ్ ని త‌న‌దైన స్టైల్ లో సూప‌ర్ అనేలా చేసి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ 3కి నాగార్జున అయితే బాగుంటుంద‌ని మా టీవీ యాజ‌మాన్యం భావిస్తోంద‌ట‌. ఈ విష‌య‌మై నాగ్ తో చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి…నాగ్ ఎస్ అంటారో..?  నో అంటారో..?  చూడాలి..!    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here