Home Actor బిగ్ బాస్ 3 తో స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన నాగ్.

బిగ్ బాస్ 3 తో స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన నాగ్.

40
0
బిగ్ బాస్ 3 తో స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన నాగ్. soiceandhra

బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2.. ఈ రెండు సీజ‌న్స్ విశేషాద‌ర‌ణ పొంద‌డంతో.. బిగ్ బాస్ 3 పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. అయితే… ఈ రియాల్టీ షో ప్రారంభం కాక ముందే వివాదాలు రావ‌డంతో అస‌లు షో స్టార్ట్ అవుతుందా..?  వాయిదా ప‌డుతుందా..? అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఆఖ‌రికి అనుకున్న ప్ర‌కార‌మే షో స్టార్ట్ అయ్యింది.

ఇక నాగ్ త‌న‌దైన స్టైల్ లో హోస్ట్ గా అదర‌గొట్టేస్తున్నాడు. దీంతో ఓ స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే… ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు 16.18 రేటింగ్‌ రాగా, నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌కు ఫస్ట్‌ ఎపిసోడ్‌కు 15.05 రేటింగ్ వచ్చింది. వీళ్లిద్దరినీ క్రాస్ చేసి నాగ్‌ తొలి ఎపిసోడ్‌కు 17.92 రేటింగ్‌ సాధించి టాప్‌ ప్లేస్‌లో నిలిచి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు. జులై 21న ప్రారంభ‌మైన ఈ షో రోజురోజుకు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని పెంచుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here