Home Actor బిగ్ బాస్ 3 స‌భ్యుల గురించి నాగ్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్..!

బిగ్ బాస్ 3 స‌భ్యుల గురించి నాగ్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్..!

37
0
బిగ్ బాస్ 3 స‌భ్యుల గురించి నాగ్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్..! spiceandhra

బిగ్ బాస్ 3 షో ఇటీవల‌ ప్రారంభం కావ‌డం… ఈ షోకు విశేష స్పంద‌న వ‌స్తుండ‌డం తెలిసిందే. అయితే.. షో స్టార్ట్ కాకుండానే వివాదాలు రావ‌డంతో.. ఈ షోను వాయిదా వేద్దాం అనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి కానీ.. అనుకున్న డేట్ కే బిగ్ బాస్ 3ని ప్రారంభించారు. ఈ బిగ్ బాస్ హౌస్ లో  చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు, టీవీ ఆర్టిస్టులను ఎంపిక చేశారు. వారిలో నటి హేమ, యాంకర్ శ్రీముఖి, హీరో వరుణ్ సందేశ్ త‌దిత‌ర‌ ప్రముఖులు ఉన్నారు.

అయితే… బిగ్ బాస్ 3 స‌భ్యుల సెలెక్ష‌న్ లో రిక‌మండేష‌న్స్ ఉన్నాయ‌ని… కొంత మంది ఆరోపించ‌డం తెలిసిందే.  ఈ రోజు మ‌న్మ‌థుడు 2 ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నాగార్జున మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిస్తూ… బిగ్ బాస్ 3 గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట పెట్టారు. అది ఏంటంటే… ఈ షోకి నేను హోస్ట్ అయినప్పటికీ  ఎంపికైన 15మంది సభ్యుల లిస్ట్ కేవలం షోకి ఐదు నిమిషాల ముందు చెప్పార‌ని నాగార్జున తెలియ‌చేసారు.

ఆ 15 మందిలో కొంత మంది తెలియ‌క‌పోతే… వాళ్లు ఎవ‌రో..?  ఎందుకు సెలెక్ట్ చేసారో..?  చెప్పి వాళ్ల‌కు సంబంధించిన వీడియోస్ కూడా చూపించార‌ని నాగ్ చెప్పారు. షో ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కాబ‌ట్టి.. ముందు ముందు మ‌రింత ఆస‌క్తిగా ఉంటుంది అనుకుంటున్నాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here