Home Actor బిగ్ బాస్ 3 హోస్ట్ నాగార్జున – స్టార్ మా టీవీ.!

బిగ్ బాస్ 3 హోస్ట్ నాగార్జున – స్టార్ మా టీవీ.!

91
0
బిగ్ బాస్ 3 హోస్ట్ నాగార్జున - స్టార్ మా టీవీ.! spiceandhra

కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజ‌న్ 3 ని ప్రారంభించేందుకు స్టార్ మా స‌ర్వం సిద్ధం చేసింది. గ‌తంలో స్టార్ మా అందించిన బిగ్ బాస్ రెండు సీజ‌న్లు అద్భుత‌మైన విజ‌యాన్ని అందుకోవ‌డం మాత్ర‌మే కాదు. తెలుగులో వినోదానికి వినూత‌న్న‌మైన నిర్వ‌చ‌నం ఇవ్వ‌డంతో పాటు స్టార్ మా కి స్ప‌ష్ట‌మైన తిరుగులేని లీడ‌ర్ షిప్ ని అందించాయి.

క‌థ‌ల‌ను ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డంలో త‌న‌దైన వినూత‌న్న‌మైన ముద్ర‌తో రియాలిటీ షోల‌ను రూపొందించ‌డంలో విల‌క్ష‌ణంగా వ్య‌వ‌హ‌రించే స్టార్ మా అంత‌ర్జాతీయంగా అద్భుత‌మైన విజ‌యానికి ప‌ర్యాయ‌ప‌దం లాంటి బిగ్ బాస్ ఫార్మాట్ ని మూడో సీజ‌న్ గా అందించ‌బోతుంది.

వెండితెర మ‌న్మ‌థుడు నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ మూడో సీజ‌న్ ని న‌డిపించ‌బోతున్నారు. త‌రాల‌తో సంబంధం లేకుండా సంపాదించుకున్న అభిమానం, సామాజికంగా సాధించుకున్న పేరు ప్ర‌ఖ్యాతుల‌తో ఆయ‌న ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిత్వం ప్రేక్ష‌కుల్లో విభిన్న వ‌ర్గాల‌కు ఈ షోను చేర‌వేస్తుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవ‌ల విడుద‌లైన లోగో లాంఛ్ టీజ‌ర్ హోస్ట్ టీజ‌ర్ ఫిల్మ్స్ తో మార్కెట్ లో ఇప్ప‌టికే విప‌రీతంగా ఊహాగానాలు, భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

దీని గురించి అలోక్ జైన్ (బిజినెస్ హెడ్, స్టార్ తెలుగు క‌స్ట‌ర్లు) మాట్లాడుతూ… అద్భుత‌మైన వినోదాన్ని అందిస్తామ‌ని మా ప్రేక్ష‌కుల‌కు మాట ఇస్తున్నాం. తిరిగి ప్రేక్ష‌కులు మా పైన ప్రేమ‌ను చూపించి మ‌మ్మ‌ల్ని ఎలాంటి వివాదాల‌కు అవ‌కాశం లేకుండా అతి పెద్ద తెలుగు టెలివిజ‌న్ బ్రాండ్ గా  ఆశీర్వ‌దించారు. బిగ్ బాస్ 2 విజ‌య‌వంత‌మైన సీజ‌న్ల త‌రువాత నాగార్జున హోస్ట్ గా తాజా ఫ్లేవ‌ర్ తో ఈ సీజ‌న్ ని అందించేందుకు మేం ఎంతో సంతోషిస్తున్నాం. ఈ సీజ‌న్ ప్రేక్ష‌కుల‌ని మ‌రింత‌గా ఆక‌ర్షిస్తుంద‌ని ఆశ్చ‌ర్య‌ప‌రిచేందుకు హ‌మీ ఇస్తుంది.

విల‌క్ష‌ణ‌మైన స్టైల్ కి ప‌ర్యాయ‌ప‌దం, మంచిత‌నానికి నిర్వ‌చ‌నం, విజ్ఞానానికి నిద‌ర్శ‌నంగా చెప్ప‌ద‌గ్గ నాగార్జున ఈ షోకి కొత్త ఎన‌ర్జీ ఇవ్వ‌బోతున్నారు. ప్రేక్ష‌కుల‌కు వినూత్న‌మైన అనుభూతిని క‌లిగించ‌బోతున్నారు. ఈ షో గురించి నాగార్జున మాట్లాడుతూ.. ఇలా అన్నారు. నేను ఎన్నో విష‌యాల్లో ప్ర‌యోగాలు చేసాను. అలా నాకెన్నో ఎక్స్ పీరియ‌న్సెస్ ఉన్నాయి.

నాకు టెలివిజ‌న్ కొత్త కాదు. బిగ్ బాష్ లాంటి షో చేయ‌డం కొత్త అనుభూతి. ఇలాంటి షోలో నేను ఓ పార్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కొత్త ప్ర‌యాణం కోసం ఎదురు చూస్తున్నాను. త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజ‌న్ 3 సుమారు 100 రోజుల పాటు ప్ర‌తి రోజు ఆస‌క్తిక‌ర‌మైన వినోదాన్ని అందిస్తూ ప్రేక్ష‌కుల్ని అద్భుతంగా అల‌రిస్తుంద‌ని హామీ ఇస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here