Home Political News బీజేపీకి అలా.. చేయ‌డం అల‌వాటైపో్యింది – చంద్ర‌బాబు

బీజేపీకి అలా.. చేయ‌డం అల‌వాటైపో్యింది – చంద్ర‌బాబు

120
0
N.-Chandrababu-Naidu

తెలంగాణ‌లో ఇటీవ‌ల కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు త‌నిఖీలు చేయ‌డం..ఆత‌ర్వాత రేవంత్ సోద‌రుడు, బంధువులు ఇంట్లో కూడా త‌నిఖీలు చేయ‌డం తెలిసిందే. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయ‌కుల ఇళ్లు, ఆఫీస్ ల‌లో కూడా ఐటీ అధికారులు త‌న‌ఖీలు చేస్తుండ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. అమ‌రావ‌తిలో ఐటీ అధికారుల దాడుల గురించి తెలుగుదేశం నాయ‌కుల‌కు ముందుగా తెలియ‌డం..అక్క‌డ మీడియా కూడా ఉండ‌డంతో ఐటీ అధికారులు  ప్లాన్ బి అమలు చేసారు.

ఐటీ అధికారులు మొద‌ట బెంజ్ స‌ర్కిల్ లోని నారాయ‌ణ కాలేజీకి వెళ్లారు. మీడియా ఉండ‌డంతో అక్క‌డ నుంచి ఐటీ అధికారుల వాహ‌నాలు  బంద‌ర్ రోడ్డులో వెళ్లాయి. వారి వెంటే మీడియా వాహ‌నాలు కూడా వెళ్ల‌డంతో… త‌మ‌ను వెంబ‌డించ‌వ‌ద్ద‌ని మ‌ధ్యాహ్నం త‌ర్వాత తామే వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని ఐటీ అధికారులు మీడియాకి తెలియ‌చేసారు. ఇదిలా ఉంటే…ఐటీ దాడుల నేప‌ధ్యంలో చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌తో మాట్లాడారు. ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే రాష్ట్రాల్లో ఐటీ, ఈడీ దాడులు చేయ‌డం..బీజేపీకి అల‌వాటైపోయింద‌న్నారు. పార్టీ నేత‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఎటువంటి ప‌రిణామాలైనా ఎదుర్కొంటామ‌ని..రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు కాపాడ‌ట‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తామ‌ని చంద్ర‌బాబు తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here