Home Political News బీజేపీతోనే అభివృద్ది సాధ్యం – డా.ప్ర‌భోదిని

బీజేపీతోనే అభివృద్ది సాధ్యం – డా.ప్ర‌భోదిని

128
0

కంటోన్మెంట్ అభివృద్ది బీజేపీతోనే సాధ్య‌మ‌ని రాష్ట్ర మ్యానిఫెస్టో క‌మిటీ స‌భ్యురాలు డా.ప్ర‌భోదిని పేర్కొన్నారు. మూడో వార్డ్ లోని మ‌డ్ ఫోర్డ్, గాంధీన‌గ‌ర్, శ్రీరాంన‌గ‌ర్ బ‌స్తీల్లో ఆమె పాద‌యాత్ర చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ…కంటోన్మెంట్ లోని మురికివాడ ప్రాంతాల్లో స‌మ‌స్య‌లు ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఉన్నాయ‌ని ఆమె విమ‌ర్శించారు.

కంటోన్మెంట్ లో కేంద్ర ప్ర‌భుత్వ నిధుల‌తో అభివృద్ది జ‌రుగుతుంద‌ని బీజేపీని గెలిపిస్తే అభివృద్ది మ‌రింత తేలిక‌వుతుంద‌ని ఆమె పేర్కొన్నారు. క‌మ‌లం పువ్వుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాల‌ని ఓట‌ర్ల‌ను కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భాక‌ర్, అనిల్ సెన్, కుమార్ స్వామి యాద‌వ్, తిరుప‌తి, రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here