Home Political News బీజేపీతో క‌లిసే ఆలోచ‌న లేదు – కోదండ‌రామ్..!

బీజేపీతో క‌లిసే ఆలోచ‌న లేదు – కోదండ‌రామ్..!

93
0
HY09KONDARAM

టీఆర్ఎస్ కు వ్య‌తిరేకంగా ఏర్ప‌డిన మ‌హా కూట‌మిలో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐతో పాటు కోదండ‌రామ్ పార్టీ తెలంగాణ జ‌న స‌మితి కూడా చేరిన విష‌యం తెలిసిందే. అయితే…ఈ పార్టీల పొత్తుల కార‌ణంగా తెలంగాణ జ‌న స‌మితికి కేవ‌లం మూడు సీట్ల‌ను మాత్ర‌మే కేటాయించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌ధ్యంలో కోదండ‌రామ్ కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని..ఆత‌ర్వాత బీజేపీలో క‌లిసేందుకు ఆలోచిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఈ నేప‌ధ్యంలో కోదండ‌రామ్ మీడియాతో మాట్లాడుతూ…నిరంకుశ పాలనను ఎలా అంతమొందించాలనే అంశం పైనే మహాకూటమిలో చర్చించామని టీజేఎస్ అధినేత కోదండరాం తెలిపారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశం పై చర్చించలేదన్నారు. సీట్లకు సంబంధించిన చర్చ ఇంకా మొదలు కాలేదని చెప్పారు. అయితే… బీజేపీతో కలిసే ఆలోచన లేదని కోదండరాం స్పష్టం చేశారు. మరో వైపు మహా కూటమి వరుస సమావేశాలు జరుపనుంది. నేడు, రేపు కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ నేతలు చర్చలు జరుపనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటు పై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here