Home Political News బీజేపీతో పొత్తు పెట్టుకోం – ఒంట‌రిగానే పోటీ చేస్తాం –  వైసీపీ నేత‌ అంబ‌టి రాంబాబు

బీజేపీతో పొత్తు పెట్టుకోం – ఒంట‌రిగానే పోటీ చేస్తాం –  వైసీపీ నేత‌ అంబ‌టి రాంబాబు

90
0
6953_Ambati-Rambabu

వైసీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంద‌ని..ఈ రెండు పార్టీల‌ మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందం కుదిరింద‌ని టీడీపీ నేత‌లు కొన్ని రోజులుగా ఆరోఫ‌ణ‌లు చేస్తూనే ఉన్నారు. వైసీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు ఈ ఆరోప‌ణ‌ల పై  స్పందిస్తూ… రాష్ట్రంలో నాలుగున్నర ఏళ్లుగా టీడీపీ అధికారంలో వుంది. మళ్ళీ టీడీపీ  అధికారంలోకి రావాలని కొన్ని వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి అన్నారు. బీజేపీతో వైసీపీ కి పొత్తు అని టీడీపీ నేత‌లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. కొన్ని మీడియా సంస్థలు రాశాయి. కానీ..బీజేపీతో పొత్తు పెట్టుకోం.. ఒంటరిగానే పోటీ చేస్తాం అని స్ప‌ష్టం చేసారు.

కేసీఆర్ తో కలిసి పని చేయాలి అనుకున్నాం అని చంద్రబాబు అంటున్నారు. కేసీఆర్ తో కలిసి వుందాము అనుకుంటే…యాబై లక్షలు ఇచ్చి రేవంత్ ని స్టీఫెన్ సన్ దగ్గరకు ఎందుకు పంపారు అని ప్ర‌శ్నించారు. రహస్య పొత్తులు పెట్టుకోవడం వైసీపీ కి అలవాటు లేదు. బీజేపీతో ఏవిధమైన పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా లేం. రహస్య పొత్తులు పెట్టుకోవ‌డం చంద్రబాబుకి అలవాటు అని అన్నారు.

స్పీకర్ కోడెల కోర్ట్ కు రావాలని ఆదేశించింది. చంద్రబాబుకి నోటీసులు వస్తే ధర్నాలు చేశారుగా…మ‌రి..కోడెల‌కు కోర్ట్ కు ర‌మ్మ‌ని ఆదేశాలు వ‌చ్చాయ్ టీడీపీ వాళ్ళు ధర్నాలు చేయండి అన్నారు. ఎమ్మెల్యేగా,స్పీకర్ గా కోడెల అనర్హుడు. స్పీకర్ కోడెలకు నైతిక విలువలు ఉంటే రాజీనామా చేసి కోర్ట్ కి వెళ్ళాలి అన్నారు.రాఫెల్ ఒప్పందం జరిగినప్పుడు చంద్రబాబు బీజేపీ తోనే వున్నాడు. బీజేపీ తో మేము కలిసి ఉంటే…జగన్ సతీమణి భారతి పై ఈడీ కేసు ఎందుకు పెట్టింది అని ప్ర‌శ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here