Home Actor బుర్ర‌క‌థ అంద‌రికీ మంచి పేరు తీసుకువ‌స్తుంది. – సాయికుమార్

బుర్ర‌క‌థ అంద‌రికీ మంచి పేరు తీసుకువ‌స్తుంది. – సాయికుమార్

114
0
బుర్ర‌క‌థ అంద‌రికీ మంచి పేరు తీసుకువ‌స్తుంది. - సాయికుమార్ spiceandhra

ఆది సాయికుమార్‌, మిస్తీ చక్రవర్తి, నైరాశా హీరో,హీరోయిన్లుగా దీపాల ఆర్ట్స్‌, టఫెండ్‌ స్టూడియోస్‌ లిమిటెడ్‌ బేనర్ల పై ప్రముఖ రచయిత డైమండ్‌ రత్నబాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మాతలు శ్రీకాంత్‌ దీపాల, కిషోర్‌, కిరణ్‌ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘బుర్రకథ’. ఇటీవల రిలీజైన ఈ చిత్రం టీజర్‌కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ వచ్చిన విషయం అందరికీ తెల్సిందే. రీసెంట్‌గా ఈ చిత్రం ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్‌ రిలీజ్‌ చేశారు. ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. జులై 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైద‌రాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో నిర్వ‌హించారు.

ఈ వేడుక‌లో నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ… ఒక మంచి కథ ఉంటే .. మంచి డైలాగ్స్ తయారవుతాయి. అలాంటి కోవకు చెందినదే ఈ బుర్రకథ చిత్రం. సబ్జెక్టు విషయానికి వస్తే.. ఒక మనిషికి రెండు మెదడులు ఉంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో తెలియచేసే చిత్రమే బుర్రకథ. చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎంటర్టైనింగ్ గా చెప్పారు దర్శకుడు డైమండ్ రత్నం. రైటర్ గా ఉన్న తాను ఈ సినిమాతో దర్శకుడుగా మారనున్నాడు. మంచి ప్రయత్నం తోనే ముందుకు వస్తున్నాడు.

అందుకు ఆనందపడాల్సిన విషయం. సాయి కుమార్ ఎంత పెద్ద నటుడో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. తను నాకు చాలా సన్నిహితుడు. ఆయన తనయుడు ఆది సాయికుమార్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా టూ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో అతని నటన చూసి ఆశ్చర్య పోయాను. మిగతా అందరూ అద్భుతంగా వారి వారి పనిని ప్రెజెంట్ చేశారు. వండర్ ఫుల్ స్టోరీ తో వస్తున్నారు. బుర్ర పెట్టి మా సినిమాను చూసి ఆదరించండని అన్నారు.

ప్రొడ్యూసర్ శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ.. మంచి కథతో వస్తున్నాం. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ ను ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ఈ సినిమాకు రామ్ ప్రసాద్ గారి సినిమాటోగ్రఫీ మంచి ప్లస్ అవుతుంది. అలాగే సాయి కార్తిక్ మ్యూజిక్ కూడా మంచి అసెట్ అవుతుంది. ఆది సాయి కుమార్ గారు చాలా హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలో ఆదికి తండ్రి లా కాకుండా ఒక ఫ్రెండ్ లా కనిపిస్తారు. అందరి ప్రోత్సాహంతోనే ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అన్నారు.

నిర్మాత కిరణ్ రెడ్డి మాట్లాడుతూ… బుర్రకథ విడుదలకు ముందే మంచి బజ్ వచ్చింది. ఆడియన్స్ లో మంచి ఎక్సపెక్టషన్స్ ఉన్నాయి. డైమండ్ రత్నబాబు గారు మంచి ఫామ్ లో ఉన్నారు. ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. సినిమా జులై 5 న విడుదవుతుంది. తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది” అన్నారు.

డైరెక్టర్ డైమండ్‌ రత్నబాబు మాట్లాడుతూ… మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు విజయేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నా. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక బుర్రలో రెండు బ్రైన్స్ ఉంటే ఆ మనిషి తీరు.. ఎదుర్కొన్న సమస్యలు ఏంటని తెలిపే ఎంటర్టైనింగ్ సినిమా బుర్రకథ. ఎమోషన్స్ కూడా చాలా ఉన్నాయి.

అందరికీ నచ్చే చిత్రం అవుతుందని భావిస్తున్నా. సెన్సార్ వారు ఈ సినిమాను చూసి క్లీన్ యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు నచ్చిందని చెప్పారు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం మా ఈ బుర్రకథ కూడా తప్పకుండా అందరికి నచ్చి విజయం సాధిస్తుందని పూర్తి నమ్మనకంతో ఉన్నాం. జులై 5 న మా సినిమా చూసి అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ… మా గురువు గారు రాజేంద్ర ప్రసాద్ గారికి, సాయి కుమార్ గారికి , విజయేంద్ర ప్రసాద్ గారికి చాల్ థాంక్స్. బుర్రకథ చాలా బాగా వచ్చింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ, కమర్షియల్ ఎంటర్టైనర్. సినిమాను జులై 5 న అందరూ థియేటర్ కి వెళ్లి చూసి చాలా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ… ” సినిమా చాలా బాగావచ్చింది. ఆది గారు బెస్ట్ ఫెర్ఫామెన్స్ ఇచ్చారు. డైమండ్ రత్నబాబు ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లా సినిమాను తెరకెక్కించారు” అన్నారు.

డైలాగ్ కింగ్ సాయి కుమార్ మాట్లాడుతూ… హిట్ సినిమాతోనే మీ ముందుకు వస్తున్నా అని డైమండ్ రత్నం నాతో చెప్పాడు అలానే సినిమాను చిత్రీకరించాడు. విజయేంద్ర ప్రసాద్ గారు ఇక్కడికి రావడం మాకంతా పాజిటివ్ వైబ్రేషన్ ను కలిగిస్తోంది. సెన్సార్ రిపోర్ట్ కూడా బాగా చ్చింది. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా. ఇందులో ఆది నటన చాలా బాగుందని అందరూ అంటున్నారు. అందకు అందరికీ నా తరపున కృతజ్ఞతలు. ఆది కూడా చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం మీరు రేపు సినిమా లో చూస్తారు’ అన్నారు.

హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. రాజేంద్ర ప్రసాద్ గారితో కలసి నటించడం చాలా హ్యాపీ గా ఉండటం తోపాటు ఆయన ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నా.  మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం చూసి ఎంకరేజ్ చేయండి. చాలా హార్డ్ వర్క్ చేసాం. యూనిక్ లైన్ కానీ ఎక్కడా కన్ఫ్యూజన్ ఉండదు. స్క్రీన్ ప్లే చాలా క్లారిటీ తో అందరికీ అర్థం అయ్యేలా ఉంటుంది.

నిర్మాతలు చాలా సపోర్ట్ చేసి స్ట్రెంగ్త్ ఇచ్చా రు. వెంకటేష్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు. నాని, సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్ లతో సహా మిగతా హీరోలందరూ సినిమా గురుంచి పాజిటివ్ ట్వీట్ చేశారు. అందుకు వారందరికీ పేరు పేరునా నా కృతఙ్ఞతలు, జులై 5 న సినిమా రిలీజవుతుంది. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here