Home Actor బుర్ర‌క‌థ విడుద‌ల తేదీ ఖ‌రారు.

బుర్ర‌క‌థ విడుద‌ల తేదీ ఖ‌రారు.

65
0
బుర్ర‌క‌థ విడుద‌ల తేదీ ఖ‌రారు. spiceandhra

ఆది సాయికుమార్ హీరోగా న‌టించిన తాజా చిత్రం బుర్ర‌క‌థ‌. ఈ చిత్రం ద్వారా ర‌చ‌యిత‌ డైమండ్ రత్నం ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రాన్ని దీపాల ఆర్ట్స్ బ్యాన‌ర్‌ పై హెచ్‌ కె.శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమాలో ఆది సరసన మిస్తీ చక్రబోర్తి , నైరా షా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాని జూన్ 28న రిలీజ్ చేయాలి అనుకున్నారు.

ప్రమోష‌న్ కూడా  స్టార్ట్ చేసారు. రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసారు. అయితే…కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. ఇందుకు కారణం సెన్సార్ బోర్డు అనుమతి (సర్టిఫికెట్) లభించకపోవటమే. దీంతో ‘బుర్రకథ’ విడుదల వాయిదా వేయటం జరిగింది. ఈ విషయాన్ని చిత్రబృందం ఓ ప్రకటనలో తెలిపింది. ఒక రోజు ఆల‌స్యంగా జూన్ 29న బుర్ర‌క‌థ రిలీజ్ అని ప్ర‌చారం జ‌రిగింది కానీ..అలా జ‌ర‌గ‌లేదు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… జులై 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని తెలియ‌చేస్తూ.. చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేసింది. మ‌రి..స‌రైన స‌క్స‌స్ కోసం ఎదురు చూస్తున్న ఆదికి బుర్ర‌క‌థ విజ‌యాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here