Home Actor బెజ‌వాడ‌లో.. బ్లాక్ బ‌ష్ట‌ర్ బేబి.

బెజ‌వాడ‌లో.. బ్లాక్ బ‌ష్ట‌ర్ బేబి.

68
0
బెజ‌వాడ‌లో.. బ్లాక్ బ‌ష్ట‌ర్ బేబి. spiceandhra

స‌మంత అక్కినేని లేటెస్ట్ సెన్సేష‌న్ ఓ..బేబి. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న క‌థా చిత్రం ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ  క్రేజీ మూవీని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చ‌ర్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి, రావు ర‌మేష్, రాజేంద్ర‌ప్ర‌సాద్, తేజ కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా..ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద  దూసుకెళుతోంది.

ఈ విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని స‌మంత రేపు బెజ‌వాడ‌లో అభిమానుల‌ను క‌లుసుకుని సంద‌డి చేయ‌నుంది. విజయవాడ లబ్బీపేట్ లోగల ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ లో రేపు సాయంత్రం 4:30 నిమిషాల నుంచి బేబి సంద‌డి మొద‌లుకానుంది. ఈ కార్య‌క్ర‌మంలో బేబితో పాటు చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here