Home Actor బేబి గురించి బ‌న్నీ – థ్యాంక్స్ చెప్పిన నందినీ..!

బేబి గురించి బ‌న్నీ – థ్యాంక్స్ చెప్పిన నందినీ..!

150
0
బేబి గురించి బ‌న్నీ - థ్యాంక్స్ చెప్పిన నందినీ..! spiceandhra

స‌మంత అక్కినేని న‌టించిన లేటెస్ట్ మూవీ ఓ.. బేబి. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఓ.. బేబి సామాన్యుల నుంచి అసామాన్యుల వ‌ర‌కు అంద‌ర్నీ ఆక‌ట్టుకుని విశేషాద‌ర‌ణ‌తో స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న బేబి 3 రోజుల్లోనే 17 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే… సినిమా రిలీజైన ఫ‌స్ట్ షో నుంచే బేబి అద్భుతం అంటూ చిత్ర యూనిట్ ని సినీ ప్ర‌ముఖులు అభినందిస్తున్నారు.

తాజాగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా బేబి సినిమా సూప‌ర్ అంటూ అభినందించారు. చిత్ర ద‌ర్శ‌కురాలు నందినీ రెడ్డి, నిర్మాత‌ల్లో ఒక‌రైన సునీత‌ల‌ను క‌లిసి సినిమా పై త‌న స్పంద‌న తెలియ‌చేసారు. ఈ సంద‌ర్భంగా బన్నీ అభినందనల పై ద‌ర్శ‌కురాలు నందినిరెడ్డి స్పందిస్తూ… నన్ను అన్ని వేళలా ప్రోత్సహిస్తున్న బన్నీకి ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. యు ఆర్ ది బెస్ట్ బ‌న్నీ అంటూ బన్నీతో కలసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here