Home Actor బేబి..స‌క్స‌స్ మామూలుగా లేదుగా..!

బేబి..స‌క్స‌స్ మామూలుగా లేదుగా..!

38
0
బేబి..స‌క్స‌స్ మామూలుగా లేదుగా..! spiceandhra

స‌మంత లేటెస్ట్ సెన్సేష‌న్ ఓ.. బేబి. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా రిలీజ్ అయిన ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ.. సినీ పండితుల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. స‌మంత యుట‌ర్న్ అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో న‌టించింది. ఈ సినిమాకి  విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి కానీ.. క‌లెక్ష‌న్స్ మాత్రం ఆశించిన స్ధాయిలో రాలేదు.

అందుచేత ఓ.. బేబికి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో అని స‌మంత ఆస‌క్తిగా ఎదురు చూసింది. అంతే కాకుండా… ఎలాగైనా స‌రే ఈ సినిమాతో స‌క్స‌స్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ప్రీ ప్రొడ‌క్ష‌న్ నుంచి సినిమా స్క్రీన్ పై వ‌చ్చే వ‌ర‌కు చాలా కేర్ తీసుకున్నారు. ఆడియ‌న్స్ ని థియేట‌ర్ కి ర‌ప్పించ‌డం కోసం వినూత్నంగా ప‌బ్లిసిటీ చేసారు. బేబీ టీమ్ అంతా చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఆఖ‌రికి ఎంతో క‌ష్ట‌ప‌డి,  కాదు.. ఇష్టప‌డి చేసిన ప్ర‌య‌త్నానికి మంచి ఫ‌లితం వ‌చ్చింది.

15 రోజుల్లోనే 35 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసింది అంటే మామూలు విష‌యం కాదు. స‌మంత ఈ సినిమాలో  నాతో ఎంజాయ్ మామూలుగా ఉండ‌దు చూస్తారుగా అని చెప్పింది. ఈ డైలాగ్ క‌లెక్ష‌న్స్ విష‌యంలో చెప్పాలంటే… స‌మంత సినిమా క‌లెక్ష‌న్స్ మామూలుగా ఉండ‌వుగా అని..నిరూపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here