Home Actor బేబీ (స‌మంత‌) అద‌ర‌గొట్టేసింది. కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది – విక్ట‌రీ వెంక‌టేష్.

బేబీ (స‌మంత‌) అద‌ర‌గొట్టేసింది. కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది – విక్ట‌రీ వెంక‌టేష్.

131
0
బేబీ (స‌మంత‌) అద‌ర‌గొట్టేసింది. కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది - విక్ట‌రీ వెంక‌టేష్. spiceandhra

స‌మంత అక్కినేని – నందినీ రెడ్డి కాంబినేష‌న్ లో రూపొందిన విభిన్న క‌థా చిత్రం ఓ బేబి. కొరియ‌న్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్సాన్స్ రావ‌డంతో సినిమా పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మించాయి.

జులై 5న ఓ బేబీ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైద‌రాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఘ‌నంగా నిర్వ‌హించారు.
ఈ వేడుక‌కు బాబాయ్ – అబ్బాయ్ వెంక‌టేష్ – రానా ముఖ్య అతిథులుగా హాజ‌రు కావ‌డం విశేషం.

ఈ వేడుక‌లో విక్ట‌రీ వెంక‌టేష్ మాట్లాడుతూ…సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, వివేక్, సునీత‌ల‌తో క‌లిసి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసారు. రియ‌ల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఒక మంచి సినిమా తీసారు. ఒక కొత్త ప్ర‌యోగం. ఇది వండ‌ర్ ఫుల్ స‌బ్జెక్ట్. ఈ సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఈ సినిమాని చాలా బాగా తీసిన నందినిని అభినందిస్తున్నాను. కాంప్లికేటెడ్ ఐడియా అయిన‌ప్ప‌టికీ చాలా చ‌క్క‌గా తీసింది. ఈ సినిమాలో న‌టించిన న‌టీన‌టులు అంద‌రూ చాలా బాగా చేసారు.

రాజేంద్ర‌ప్ర‌సాద్, రావు ర‌మేష్, ప్ర‌గ‌తి, తేజ‌, నాగ శౌర్య..ఇలా ప్ర‌తి ఒక్క‌రు అద్భుతంగా న‌టించారు. ఈ సినిమా చూసాను. బేబీ (స‌మంత‌) అద‌ర‌గొట్టేసింది. మామూలుగా లేదు. త‌న కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. కామెడీ, సెంటిమెంట్..ఎక్స్ ట్రార్డిన‌రీగా పండించింది. రియ‌ల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమా జులై 5న రిలీజ్ కాబోతుంది. ఇది మంచి సినిమా. త‌ప్ప‌కుండా చూడండి. ప్రేక్ష‌కులు ఖచ్చితంగా ఆద‌రిస్తారు. ఓ బేబీ టీమ్ కి కంగ్రాట్స్ అని చెప్పారు.

ద‌గ్గుబాటి రానా మాట్లాడుతూ.. ఈ సినిమాలో ప‌ని చేసిన చాలా మందికి నాకు ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి అనుబంధం ఉంది. నేను ప్రొడ్యూస‌ర్ కొడుకును కాబ‌ట్టి ప్రొడ్యూస‌ర్స్ గురించి మాట్లాడ‌తాను. నేను టెన్త్ క్లాస్ లో ఫెయిల్ అయిన‌ప్పుడు ఏ ప‌ని రాక‌పోతే మా నాన్న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా పెట్టారు. అప్పుడు ఈ చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన‌ సునీత‌ను క‌లిసాను. ఫిల్మ్ మేకింగ్ అనేది చ‌దువు. ప్రొడ‌క్ష‌న్ గురించి తెలుసుకోవాలి. ఫిల్మ్ మేకింగ్ గురించి తెలుసుకోవాలి అని సునీతని క‌లిసిన‌ప్పుడు తెలిసింది. అది జ‌రిగింది 1999లో.

ఆత‌ర్వాత నేను లీడ‌ర్ సినిమా చేసిన‌ప్పుడు ఆ సినిమాకి నాగ్ అశ్విన్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్. అప్పుడు తెలుగులో కొత్త సినిమాలు రావాలి అని మాట్లాడుకునే వాళ్లం త‌ప్పా..ఏం చేసేవాళ్లం కాదు. ఇప్పుడు తెలుగులో మ‌ల్లేశం, ఫ‌ల‌క్ నామా దాస్…ఇలా కొత్త త‌ర‌హా సినిమాలు వ‌స్తున్నాయి. ఇప్పుడు ఓ బేబీ వ‌స్తుంది. ఇలాంటి సినిమాలు తెలుగులో ఎన్నో రావాలి. ప్ర‌తి వారం రావాలి. ఆడియ‌న్స్ ఈ సినిమాల‌ని చూడాలి అని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్న వాళ్ల‌ల్లో నేను ఒక‌డిని.

లీడ‌ర్ వ‌చ్చిన సంవ‌త్స‌రంలోనే మ‌రో అద్భుత‌మైన సినిమా వ‌చ్చింది. అదే…ఏ మాయ చేసావే. ఆ సినిమాలో న‌టించింది స‌మంత‌. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స్ధాపించి 55 సంవ‌త్స‌రాలు అయ్యింది. 55 సంవ‌త్స‌రాలు అయ్యింది అని పోస్ట‌ర్ వ‌చ్చిన‌ప్పుడు అందులో మా చిన్నాన్న పోస్ట‌ర్ లేదు. నా పోస్ట‌ర్ లేదు. మా నాన్న పోస్ట‌ర్ లేదు. చైత‌న్య పోస్ట‌ర్ లేదు. కానీ..స‌మంత పోస్టర్ ఉంది. సో..స‌మంత వెల్ క‌మ్ హామ్. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో కొత్త శ‌కం ప్రారంభ‌మైంది. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్స్ కి సినిమా చూడ‌కుండా వ‌స్తాం. కానీ..ఈ సినిమా చూసాను. అందుచేత క‌థ చెప్పేస్తానేమో అనే కంగారు ఉంది. పెంటాస్టిక్ ఫిల్మ్ చేసినందుకు ఈ చిత్రంలో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రికి కంగ్రాట్స్ చెబుతున్నాను.

ఈ సినిమా ఫంక్షన్ కి రావ‌డానికి ఓ పెద్ద కార‌ణం ఉంది. అది సీనియ‌ర్ యాక్ట‌ర్ ల‌క్ష్మీ గారు కానీ..ల‌క్ష్మీ గారు ఈ ఫంక్ష‌న్ లో క‌నిపించ‌లేదు. మ‌నం తాత గురించి..నాన్న గురించి మాట్లాడ‌తాం. వాళ్లు ఏం చేసారో మాట్లాడ‌తాం అయితే.. చాలా త‌క్కువ సార్లు మ‌న నాన‌మ్మ గురించి అమ్మ గురించి మాట్లాడ‌తాం. వాళ్ల‌కంటూ యాంబిష‌న్ ఉండ‌దు. ఎందుకంటే మ‌న‌మే వాళ్ల యాంబిష‌న్ అయిపోతాం. ఏ రోజు వాళ్ల‌కి ఐ ల‌వ్ యు అనో థ్యాంక్స్ అనో చెప్పం. ఆ ప‌దాలు చాలా చిన్న‌వి. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది. జులై 5న థియేట‌ర్లో క‌లుద్దాం. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ వివేక్ కూచిభోట్ల మాట్లాడుతూ…ఈ స్టేజ్ మీద సురేష్ బాబు గారు, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ గారు ఇద్ద‌రూ లేరు. వాళ్లిద్ద‌రి త‌రుపున ఈ సినిమాకి క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన ఆర్టిస్టుల‌కి, టెక్నీషియ‌న్స్ కి చాలా థ్యాంక్స్ అండి. ప‌ర్స‌న‌ల్ గా ఈ సినిమా ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియ‌న్స్. రామానాయుడు స్టూడియోలో అంద‌రూ ఫీజు క‌ట్టి జాయ‌న్ అవుతారు. నాకు సునీత గారి ప్ర‌తి రోజు లెర్నింగ్ ఎక్స్ పీరియ‌న్స్. సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నాం. అంద‌రూ 5వ తారీఖున మా న‌మ్మ‌కం నిజం చేస్తార‌ని ఆశిస్తూ థ్యాంక్యూ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here