Home Actor బోయ‌పాటి ఆ.. హీరోతో సినిమా చేస్తున్నాడా..?

బోయ‌పాటి ఆ.. హీరోతో సినిమా చేస్తున్నాడా..?

34
0
బోయ‌పాటి ఆ..హీరోతో సినిమా చేస్తున్నాడా..? spiceandhra

ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో తీసిన విన‌య విధేయ రామ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో ఆయ‌న‌తో సినిమా చేసేందుకు హీరోలు ఇంట్ర‌స్ట్ చూపించ‌డం లేదు. బాల‌కృష్ణ బోయ‌పాటితో సినిమాని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టికీ… బ‌డ్జెట్ ఎక్కువ కార‌ణంగా ఈ ప్రాజెక్ట్ ఆగింద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఇటీవ‌ల మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ బోయ‌పాటితో సినిమా చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో బ‌న్నీతో బోయ‌పాటి సినిమా క‌న్ ఫ‌ర్మ్ అంటూ ప్ర‌చారం జ‌రిగింది. న‌వంబ‌ర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అనే టాక్ వ‌చ్చింది కానీ..బ‌న్నీ సుకుమార్, వేణు శ్రీరామ్ ల‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్ప‌డంతో బోయ‌పాటితో ప్రాజెక్ట్ ఇప్ప‌ట్లో సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం లేదు.

మ‌రి..బోయ‌పాటి నెక్ట్స్ మూవీ గురించి కొత్త‌గా ప్ర‌చారంలోకి వ‌చ్చిన వార్త ఏంటంటే… క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి త‌న‌యుడు నిఖిల్ గౌడ్ తో బోయ‌పాటి మూవీ ప్లాన్ చేస్తున్నార‌ట‌. జాగ్వార్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన నిఖిల్ గౌడ్ ఈసారి బోయ‌పాటితో సినిమా చేసి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవాల‌నుకుంటున్నాడ‌ని తెలిసింది. మ‌రి.. ఈ వార్త వాస్త‌వ‌మేనా..?  కాదా..?  అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here