Home Telugu బ్యాంకాక్ లో.. బోయ‌పాటి, చ‌ర‌ణ్  ఏం చేస్తున్నారు..?

బ్యాంకాక్ లో.. బోయ‌పాటి, చ‌ర‌ణ్  ఏం చేస్తున్నారు..?

108
0

రంగ‌స్థ‌లం చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం సాధించిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయ‌పాటి తో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న కైరా అద్వాని న‌టిస్తోంది. ఈ భారీ చిత్రాన్ని డి.వి.వి. దాన‌య్య నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఓ షెడ్యూల్ ను హైద‌రాబాద్ లో చిత్రీక‌రించారు. చ‌ర‌ణ్ పై యాక్ష‌న్ సీన్ ను చిత్రీక‌రించిన‌ టీమ్ తాజా షెడ్యూల్ ను ఈనెల 12 నుంచి బ్యాంకాక్ లో స్టార్ట్ చేసారు.

ఈ షెడ్యూల్ లో 15 రోజులు పాటు షూటింగ్ చేయ‌నున్నారు. అక్క‌డ చిత్రీక‌రించే స‌న్నివేశాలు మూవీ  హైలైట్స్ లో ఒక‌టిగా నిలుస్తాయంటున్నారు. ఇదిలా ఉంటే… బోయ‌పాటి సినిమా అంటే…ఎంత మాస్ గా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈ ఊర‌..మాస్ డైరెక్ట‌ర్ కి మాస్ లో మాంచి క్రేజ్ ఉన్న హీరో రామ్ చ‌ర‌ణ్ జ‌త క‌లిస్తే..ఇక ఈ సినిమా ఏరేంజ్ లో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. అయితే…ప్రేక్ష‌కాభిమానుల అంచ‌నాలు ఏ స్ధాయిలో ఉన్నా..ఖ‌చ్చితంగా అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఈ సినిమా ఉంటుందంటున్నారు బోయ‌పాటి.

రంగ‌స్థ‌లం చిత్రంతో 200 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసి…సంచ‌ల‌న విజ‌యం సొంతం చేసుకున్న రామ్ చ‌ర‌ణ్…ఈ స‌క్స‌స్ ని బోయ‌పాటి సినిమాతో కంటిన్యూ చేస్తారేమో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here