Home Actor బ్యాంకు అకౌంట్స్ జప్తు పై మహేష్ బాబు టీం వివరణ.!

బ్యాంకు అకౌంట్స్ జప్తు పై మహేష్ బాబు టీం వివరణ.!

122
0

జి ఎస్ టి కమిషనరేట్, హైదరాబాద్ వారు, కోర్ట్ పరిధి లో ఉన్న 18 లక్షల 50 వేల రూపాయల  పన్నుని వడ్డీతో కలిపి  73 లక్షల 50 వేలు గా నిర్ణయించి బ్యాంకు అకౌంట్ల నిలుపుదలకు ఆదేశించారు. 2007 – 08 ఆర్ధిక సంవత్సరానికి గాను అంబాసిడర్ సర్వీసెస్ కి ఈ పన్ను చెల్లించాలని వారు నిర్ణయించారు. వాస్తవానికి ఆ కాలంలో  అంబాసిడర్ సర్వీసెస్ ఎటువంటి టాక్స్ పరిధిలోకి రాదు. అంబాసిడర్ సర్వీసెస్ ని టాక్స్ పరిధిలోకి సెక్షన్ 65 (105) (zzzzq ) ద్వారా 01 -07 -2010 నుండి చేర్చడం జరిగింది. టాక్స్ పేయర్ చట్టపరమైన అన్ని నియమాలకు లోబడే ఉన్నా, ఎటువంటి నోటీసు లేకుండా, పైగా ఈ విషయం ఇంకా కోర్ట్ పరిధిలో ఉన్నప్పటికీ  జి ఎస్ టి కమిషనరేట్ బ్యాంకు అకౌంట్ల నిలుపుదలకు ఆదేశించడం జరిగింది. మహేష్ బాబు చట్టానికి కట్టుబడే పౌరునిగా తన పన్నులన్నిటినీ సక్రమంగా చెల్లించారు.

—- లీగల్ టీం ఆఫ్ జి.మహేష్ బాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here