Home Actor బ్ర‌హ్మాస్త్ర గురించి జ‌క్క‌న్న ఏమ‌న్నాడో తెలుసా..?

బ్ర‌హ్మాస్త్ర గురించి జ‌క్క‌న్న ఏమ‌న్నాడో తెలుసా..?

116
0


ర‌ణ‌భీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ జంట‌గా ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో హీరూ జోహార్‌, అపూర్వ మెహ‌తా, ఆసిమ్ జ‌బాజ్‌, గులాబ్ సింగ్ త‌న్వ‌ర్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ బ్ర‌హ్మాస్త్ర‌. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా లోగోను ఇటీవ‌ల‌ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌యాగ కుంభ‌మేళాలో వినూత్నంగా విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

  150 డ్రోన్ కెమెరాల స‌హాయంతో బ్ర‌హ్మాస్త్ర అనే లోగోను ఆకాశంలో ఆవిష్క‌రించడం విశేషం. ఇలా డ్రోన్స్ స‌హాయంతో ఆకాశంలో లోగోను ఆవిష్క‌రించ‌డం సినిమా చరిత్ర‌లో ఇదే మొద‌టిసారి. తాజాగా తెలుగు టైటిల్ లోగోను ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి తన ట్విటర్ ద్వారా రిలీజ్ చేశారు.

అద్భుతమైన నటీనటులతో, మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు లోగోను విడుదల చేసినందుకు సంతోషంగా ఉంది అని రాజ‌మౌళి ట్వీట్‌ చేశారు. ఈ క్రిస్మస్ కి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. హిందీతో పాటు తెలుగు, త‌మిళ‌, మ‌లయాళ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here