Home Movie News బ‌న్నీకి ఆ..డైరెక్ట‌ర్స్ క‌థలు చెప్పారా..?

బ‌న్నీకి ఆ..డైరెక్ట‌ర్స్ క‌థలు చెప్పారా..?

100
0
allu-story_647_022317122548

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో నెక్ట్స్ మూవీ విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. చాలా క‌థ‌లు విన్నాడు.. వింటున్నాడు కానీ…ఏ స్టోరీని ఫైన‌ల్ చేయ‌డం లేదు. గీత గోవిందంతో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకున్న ప‌రశురామ్ బన్నీ కోసం ఓ స్టోరీ రెడీ చేస్తున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ప‌ర‌శురామ్ బ‌న్నీకి క‌థ చెప్ప‌నున్నాడ‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే…రీసెంట్ గా ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ బ‌న్నీకి ఓ స్టోరీ చెప్పాడ‌ట‌. ఈ క‌థ బ‌న్నీకి బాగా న‌చ్చింద‌ట కానీ…బ‌న్నీ మాత్రం ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేద‌ట‌.

గ‌రుడ‌వేగ‌తో సూప‌ర్ హిట్ సాధించిన ప్ర‌వీణ్ స‌త్తారు కూడా బ‌న్నీకి క‌థ చెప్పాడ‌ని తెలిసింది. కానీ..బ‌న్నీ ఈ క‌థ విష‌యంలో ఏ నిర్ణ‌యం తీసుకోలేద‌ట‌. మాంచి ఎంట‌ర్ టైన‌ర్ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. అందుచేత త‌ను అనుకున్న స్టోరీ వ‌చ్చే వ‌ర‌కు ఇలా క‌థ‌లు వింటూనే ఉంటాడ‌నుకుంట‌. మ‌రో వైపు త్రివిక్ర‌మ్ తో సినిమా చేయ‌నున్నాడు అనే టాక్ వస్తుంది. అర‌వింద స‌మేత సినిమా ద‌స‌రా కానుక‌గా ఈ నెల 11న రిలీజ్ కానుంది. మ‌రి…ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత బ‌న్నీ – త్రివిక్ర‌మ్ సినిమా పై క్లారిటీ వ‌స్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here