Home Actor బ‌న్నీమూవీలో చంద‌మామ‌..?

బ‌న్నీమూవీలో చంద‌మామ‌..?

94
0

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారికా & హాసిని క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటోంది. బ‌న్నీ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తోన్న ఈ చిత్రంలో సుశాంత్‌, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే… ఈ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ కోసం చందమామ కాజల్ అగర్వాల్‌ను సంప్ర‌దించార‌ట చిత్ర‌ యూనిట్‌. పాట కాన్సెప్ట్ న‌చ్చ‌డంతో కాజ‌ల్ ఈ సాంగ్  చేయ‌డానికి వెంట‌నే ఓకే చెప్పింద‌ని టాక్‌. జనతా గ్యారేజ్‌ సినిమా కోసం కాజ‌ల్ తొలిసారి ఐట‌మ్ సాంగ్ చేసింది. ఎన్టీఆర్‌తో కలిసి ఆమె చిందేసిన పక్కా లోకల్ సాంగ్ యూత్ కి బాగా న‌చ్చింది.  మ‌రి..బ‌న్నీతో చేసే ఈ సాంగ్ తో కూడా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుందేమో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here