Home Movie News బ‌న్నీ ఆ డైరెక్ట‌ర్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడా..?

బ‌న్నీ ఆ డైరెక్ట‌ర్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడా..?

93
0
allu arjun new pic

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో ఇక నుంచి చేసే సినిమాల విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌. అందుక‌నే ఇప్ప‌టి వ‌ర‌కు నెక్ట్స్ మూవీ ఏంటి అనేది ఎనౌన్స్ చేయ‌లేదు. మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ తో సినిమా చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో బ‌న్నీ ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నాడ‌ని..ఇది పున‌ర్జ‌న్మ నేప‌ధ్యంలో సాగే సినిమా అని టాక్ వినిపిస్తోంది కానీ..అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌లేదు.

ఇదిలా ఉంటే..బ‌న్నీ గురించి మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే…గ‌తంలో బ‌న్నీ తెలుగు, త‌మిళ్ లో ఓ సినిమా చేయాల‌నుకున్నాడు. ఈ భారీ చిత్రానికి లింగుస్వామి ద‌ర్శ‌కుడు. జ్ఞాన‌వేల్ రాజా ఈ సినిమాని నిర్మించాల‌నుకున్నారు. కానీ..కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఇప్పుడు బ‌న్నీ తెలుగు, త‌మిళ్ లో సినిమా చేయాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట‌. దీంతో లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో చేయాల‌నుకున్న సినిమాని వీరం, వేదాళం చిత్రాల ద‌ర్శ‌కుడు శివతో చేయాల‌నుకుంటున్నార‌ని తెలిసింది. స‌మ్మ‌ర్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here