Home Actor బ‌న్నీ, త్రివిక్ర‌మ్ మూవీ టైటిల్ ఇదే..!

బ‌న్నీ, త్రివిక్ర‌మ్ మూవీ టైటిల్ ఇదే..!

96
0


స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో జులాయి, సన్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాలు రూపొందిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రు క‌లిసి మూడ‌వ సినిమా చేయ‌నున్నారు. ఈ భారీ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ & హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీని ఎనౌన్స్ చేసిన చాలా రోజులు అయిన‌ప్ప‌టికీ…ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్లేలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాని స్టార్ట్ చేస్తారా..?  అని బ‌న్నీ ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే…ఈ మూవీకి నాన్న- నేను అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.  ఈ టైటిల్ ని బ‌ట్టి ఇది తండ్రీ కొడుకుల మ‌ధ్య సాగే ఎమోష‌న‌ల్ డ్రామా అని తెలుస్తుంది. గ‌తంలో బ‌న్నీతో త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రం తండ్రీకొడుకుల క‌థే. ఈసారి కూడా త్రివిక్ర‌మ్ నాన్న క‌థ‌నే ఎంచుకోవ‌డం విశేషం.  ఓ కొత్త పాయింట్ తో పాటు తండ్రీ కొడుకుల మ‌ధ్య ఎమోష‌న్ హైలైట్ గా ఈ సినిమా ఉంటుంద‌ట‌.  ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఎస్.ఎస్.త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రం షూటింగ్  ఏప్రిల్ లో ప్రారంభించ‌నున్నారని స‌మాచారం.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here