Home Actor బ‌న్నీ – త్రివిక్ర‌మ్ మూవీ ప్రారంభం..!

బ‌న్నీ – త్రివిక్ర‌మ్ మూవీ ప్రారంభం..!

114
0

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో రూపొందిన జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాలు స‌క్స‌స్ సాధించ‌డం తెలిసిందే. తాజాగా వీరిద్ద‌రు క‌లిసి ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు. గీతా ఆర్ట్స్ & హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ రోజు ఈ మూవీని  సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ప్రారంభించారు. 

ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నారు. గతంలో అల్లు అర్జున్ సరసన ఆమె దువ్వాడ జగన్నాథం సినిమాలో మెప్పించిన సంగతి తెలిసిందే. ఎస్.ఎస్.త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. దీనికి నాన్న నేను అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ని…ఇది తండ్రి కొడుకు అనుబంధం నేప‌థ్యంలో ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి..బ‌న్నీ, తివిక్ర‌మ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారేమో చూడాలి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here