Home Actor బ‌న్నీ – త్రివిక్ర‌మ్ మూవీ టైటిల్ అల‌.. వైకుంఠ‌పురంలో..

బ‌న్నీ – త్రివిక్ర‌మ్ మూవీ టైటిల్ అల‌.. వైకుంఠ‌పురంలో..

19
0

స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ మాటల మాంత్రికుడు,సుప్రసిద్ధ సినీ దర్శకుడు ‘త్రివిక్రమ్’ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన బారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పేరును ‘అల వైకుంఠపురములో’. గా నిర్ణయించారు.దీనికి సంబంధించిన వీడియోను విడుదలచేశారు.

హీరోగా అల్లు అర్జున్ కు ఇది 19 వ చిత్రం కాగా, అల్లు అర్జున్,త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో మూడో చిత్రం. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్ర విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇటు సినీ వాణిజ్య రంగాల్లో, అటు ప్రేక్షక వర్గాల్లోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వీటిని నిజం చేసే దిశగా సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ‘గీతాఆర్ట్స్’ అధినేతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. రెండు పెద్ద నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేస్తుండడంతో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి.

సాధారణంగా త్రివిక్రమ్ చిత్రాల టైటిల్స్ కి క్రేజ్ బాగా ఎక్కువ. అలాంటిది అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఎలాంటి టైటిల్ పెట్టనున్నారా అనే ఆసక్తి బాగా పెరిగింది. అందరి అంచనాలకు మించిన మంచి టైటిల్ కుదరడంతో చిత్ర యూనిట్ ఆనందంగా ఉన్నారు. సినిమా కథకు సరిగ్గా సరిపోవడం… అల్లు అర్జున్ ఇమేజ్ కు ఏమాత్రం తీసిపోని ఈ టైటిల్ తో సినిమాకు మరింత బజ్ పెరిగింది. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో చిత్ర టైటిల్ కూడా ఫెస్టివల్ మూడ్ కి సరిగ్గా సరిపోవడం కలిసి వచ్చే మరో అంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here