Home Actor బ‌న్నీ మూవీలో టబు లుక్ ఇదే.

బ‌న్నీ మూవీలో టబు లుక్ ఇదే.

32
0
బ‌న్నీ మూవీలో టబు లుక్ ఇదే. spiceandhra

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంకా టైటిల్ ను ఖరారు చేయని ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. మరో ముఖ్యమైన పాత్రలో నివేదా పేతురాజ్ కనిపించనుంది.

 ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ టబు కూడా ఒక కీలకమైన పాత్రను పోషించనున్నట్టు వార్తలు వచ్చాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకి స్వాగతం చెబుతూ గీతా ఆర్ట్స్ వారు ఒక వీడియోను సోస‌ల్ మీడియాలో  పోస్ట్ చేశారు. ఈ వీడియోలో హాయ్ చెబుతూ .. తన పాత్రకి సంబంధించిన డైలాగ్స్ ను చూసుకుంటూ టబు సంప్రదాయబద్ధమైన లుక్ తో చాలా అందంగా కనిపిస్తోంది.

ఈ భారీ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.  ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్న‌ట్టు ఇటీవ‌ల అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు.  బ‌న్నీ, త్రివిక్ర‌మ్ క‌లిసి చేసిన జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాలు స‌క్స‌స్ సాధించ‌డంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తార‌ని చిత్ర యూనిట్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here